Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

20 August 2021

Ghanudaina Yehova Gadde | ఘనుఁడైన యెహోవా గద్దె

61
సృష్టికర్త స్తుతి
రా – కాంభోజి, తా – ఝంపై
                      
    ఘనుఁడైన యెహోవా - గద్దె ముందట మీరు - ¹వినతు లిప్పుడు చేయుడి - యోజనులార - వినయంబుగా నిర్మ - లానంద ²రసలహచేయుడ మన మనం బొప్పుచుండ - నో జనులార || ఘనుఁడైన ||

1.ఒక్కఁడే మన కర్తయుండు దేవుడని యున్ – జక్కగాను సృజియించు - సంహరించు ననియున్ - నిక్కముగఁ దెలిసికొండీ మన సహాయమే - మక్కర లేకుండ మనల = మిక్కుటపు పరిపాలనపు బలముచేఁ జేసె – మృత్తుచే మానవులఁగ – దిక్కు = గానక తిరుగు గొ – గ్రెల వలె మనము చెదరఁ – దిరుగఁదన దొడ్డిఁబెట్టె – నో జనులారా ||ఘనుఁడైన ||

2.మే మందరము వందనపు పాటతో మూగి – మించు నీ గుమ్మములలో – మామా స్వరము లెత్తుదుము నభము పొడవుగా – మధురలయ సహితముగను – భూమియున్ దనదు పదివేల జిహ్వల వలఁ – బొందైన నీ నగరి కా – ధామంబులను గాన సన్నుతి వితతిపూరి – తమ్ములుగఁ జేయు దేవా యో జనులార || ఘనుఁడైన ||

3.ధరయంత విస్తారమైయున్నది నీ యాజ్ఞ – తగ విరహితాద్యంతమై – స్థిరమైన కాలంబువలెనే యున్న దయదయ - పొరలిపోవుచు నున్న వ = త్సరముల్ నిలిచిపోయి నప్పటికిని నీదు - సత్యంబు నిలిచియుండున్ – వర శిలా ఖండ పర్వతము తోడను సాటి – వన్నె కెక్కుచు నెంతయున్ ఓ జనులార || ఘనుఁడైన ||
                                       - విలియం డాసన్
________________________________
¹స్తోత్రములు . ²ఆల

19 August 2021

Ghana bhava dupakruthulanu | ఘన భవ దుపకృతులను మాటికి

68
ప్రభువైన యేసునకు స్తుతి
రా – ఆనందభైరవి,  తా – ఆది
(ఛాయ: యేసువంటి ప్రియబంధుఁడు)
               
¹ఘన ²భవ దుపకృతు - లను మాటికి నే - వినుతింతును దే - నిజసుత = యొనరఁగ నాపై - ³ననుక్రోశముఁ దగ - ⁴నునుపవే క్రైస్తవ - జన విహిత || ఘన ||

1.ధోరణిగా నా దోసము లెంచకు సారెకు నాశ్రిత జనవరదా = ⁵పారముఁ దప్పిన - పాతకు నగు నే నారడివడ నీ - కది బిరుదా॥ఘన||

2.జలబుద్బుదముతో - సమ మని నాస్థితి - తెలియద నీకది - దేహధరా ఖలమయ మగు నీ - కర్మినిఁ బ్రోవను - సిలువను బొందిన - శ్రేయఃకరా || ఘన||

3.మందమతిని నా యందు నలక్ష్యము నొందకు దేవ ⁶సు - నంద నా = యందముగా నా ⁷డెందము కడుఁ దెలి - వొందఁగ నీ దయ - నందు మా || ఘన ||
                           - మిక్కిలి నమూయేలు
____________________________
¹గొప్పయైన. ²నీ ఉపకారములను. ³ప్రేమ. ⁴ఉంచుము. ⁵గట్లు లేక మేర. ⁶సుపుత్రుఁడా. ⁷హృదయము .

05 March 2021

Ghanamainavi nee kaaryamulu | ఘనమైనవి నీ కార్యములు నా యెడల


ఘనమైనవి నీ కార్యములు నా యెడల - 
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా 
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి -  స్తుతులర్పించెదను అన్నివేళలా (2)
అనుదినము నీ అనుగ్రహమే - ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి||

1.ఏ తెగులు సమిపించనీయ్యక - ఏ కీడైన దరిచేరనీయ్యక - ఆపదలన్నీ తొలగేవరకు - ఆత్మలో నెమ్మది కలిగేవరకు (2)
నా భారముమోసి బాసటగా నిలిచి - ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||

2.నాకు ఎతైన కోటవు నీవే - నను కాపాడు కేడెము నీవే - ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2)
నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి - నడిపించు చున్నావు 
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||

3.నీకృపతప్ప వేరొకటి లేదయ - నీ మనస్సులో నేనుంటే చాలయ - బహుకాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నాయెడ చాలునంటివే (2)
నీ అరచేతిలో నను చెక్కుకొంటివి - నాకేమి కొదువా 
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము || ఘనమైనవి ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...