Showing posts with label Nissi John. Show all posts
Showing posts with label Nissi John. Show all posts

02 April 2022

Kanulatho kaanalenu aa ghora | కనులతో కానలేను ఆ ఘోర మరణం

Kanulatho Kaanalenu Full Video Song || Latest Telugu Good Friday Song 2022 || Jesus 7 Words Song || Nuthan Babu G , Prashanth Penumaka || Nissi john కనులతో కానలేను ఆ ఘోర మరణం - యేసు ప్రభువు సిలువలో పలికిన 7 మాటలను గూర్చిన పాట

కనులతో కానలేను ఆ ఘోర మరణం - కండ్లను తెరువంగజేయ మనకై బలిదానం 
ఎంత గొప్పదో తన త్యాగము - ఎంతెంత గొప్పదో ఆ ప్రాణ త్యాగము 

తన దేహం చీల్చుతున్న వారికోసమే - తెలియక చేసిరి తండ్రి క్షమియించుమనెనే 
ఎంత గొప్పదో తన ప్రార్థన - ఎంతెంత గొప్పదో ఆ క్షమా ప్రార్థన 

తన పాపం ఒప్పుకున్న పాపి తోడనే - పరదైసుకు వచ్చెదవని అభయమునే ఇచ్చెనే 
ఎంత గొప్పదో తన రక్షణ - ఎంతెంత గొప్పదో ఆ పాపి రక్షణ 

ఒంటరైన కన్నతల్లి మరియను జూచి - శిష్యునికే అప్పగించి బాధ్యతనే తీర్చెనే 
ఎంత గొప్పదో తన బాధ్యత - ఎంతెంత గొప్పదో ఆ సుతుని బాధ్యత

కన్న తండ్రి చేయి విడువని ఈ ప్రేమ పుత్రుడే - నన్నెందుకు విడిచితివని వేదనతో అరిచెనే 
ఎంత గొప్పదో తన బంధము ఎంతెంత గొప్పదో ఆ ప్రేమ బంధము 

జీవజల ధారలను పంచిన ఇతనే - లేఖన నెరవేర్పుకై దప్పికగా ఉందనే 
ఎంత గొప్పదో తన దాహము - ఎంతెంత గొప్పదో ఆ ఆత్మ దాహము 

జీవితకాలమంత సేవ చేయగా - ప్రాణమిచ్చుతోడనే సమాప్తమైనదనెనే 
ఎంత గొప్పదో తన సేవ - ఎంతెంత గొప్పదో ఆ సంపూర్ణ సేవ 

అప్పగించే తన దేహం మన కోసమే - ఆత్మను తండ్రికి ఇచ్చి ప్రాణమునే విడిచెనే 
ఎంత గొప్పదో తన అర్పణ - ఎంతెంత గొప్పదో ఆ సమర్పణ 

కనులతో కానలేను ఆ ఘోర మరణం - పాపము తుడువంగజేయ మనకై బలిదానం 
ఎంత గొప్పదో తన త్యాగము - ఎంతెంత గొప్పదో ఆ ప్రాణ త్యాగము

21 August 2021

Vaadipoye Puvvura Aaripoye | వాడిపోయే పువ్వురా ఆరిపోయే

వాడిపోయే పువ్వురా - ఆరిపోయే దివ్వేరా 
భూమి మీద ఈ బ్రతుకు సోదరా 
లోకమంతా మాయరా - ఇది ఎండమావే సోదరా ఏదినీదీ కాదురా నమ్మరా 
ఛేదనుండి జారిపడినా నీటిబిందువురా 
గాలికెగిరి కానరాని ధూళివంటిదిరా - 
ఇది అల్పమైనదిరా || వాడిపోయే || 

1. స్థలమునాదనీ ఈ పొలమునాదనీ స్థలము , పొలము, నాదిఅన్నా మనిషి ఏడిరా - ఏమైనాడురా 
తోటనాదనీ ఈ కోటనాదనీ తోట , కోటనేలినా రాజు ఏడిరా - ఏమైనాడురా 
పుట్టినోడీ మట్టికీ వచ్చినోడురా - మన సొంతఊరిది కాదనీ కానవేమిరా 
ఏనాటికైన కాయము మాయమౌనురా - ఇల ఏదినీదిరా || వాడిపోయే ||

2. ఈ కులమునాదనీ ఈ మతమునాదనీ 
కులము, మతమను విర్రవీగిన మనిషి ఏడిరా - ఏమైనాడురా 
ఘనుడునేననీ - దేహాబలుడునేననీ ఘనుడు, బలుడని అతిశయించిన మనిషిఏడిరా - ఇల నిలువలేడురా 
దేహామే మన్ననీ మరచిపోకురా - ఈ లోకమే నిజమనీ నమ్మమాకురా 
ఏనాటికైన దేహాము మన్నేసోదరా ఆత్మేనీవురా || వాడిపోయే ||

3. అందముందనీ - ఆరోగ్యముందనీ 
అందము, ఆరోగ్యము స్థిరముకాదనీ - తెలిపినది వ్యాధనీ 
ఆస్థివుందనీ - అంతస్తువుందనీ ఆస్థిపాస్తులు ఆపలేదే మనిషి చావునీ - అక్కరకు రావనీ
వ్యాధిమనిషికి బోధనే చేసినాదనీ హిజ్కియా వలే మార్పునే చూడాలనీ 
ఏనాటికైన దైవమే దిక్కు నీకనీ నమ్మాలి క్రీస్తునీ || వాడిపోయే ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Chejarithe Thirigi Radu Ee | చేజారితే తిరిగి రాదు ఈ సమయం

చేజారితే తిరిగి రాదు ఈ సమయం


చేజారితే తిరిగి రాదు ఈ సమయం – చేయాలిగా సద్వినియోగం 
విలువైనది సమయం - దేవునికర్పించుమా 
కాలముండగానే - ప్రభువు పనిలో సాగుమా.. (2) 

1. తిరిగిరాదు ఈ కాలం వ్యర్ధముగా గడపకూ - పాపములో బ్రతుకుతూ నాశన్నాని పొందకు (2) 
దుర్డినములు రాకముందే ప్రభు చెంతకు చేరుమా(2)
మరణఛాయా కమ్మకముందే క్రీస్తు కొరకు బ్రతుకుమా ||చేజారితే||

2. దేవుడిచ్చిన వరమే ఈ జీవత సమయం - మలుచుకో ఆ సమయం దేవునికి అనుకూలంగా (2)
పరమతండ్రి చిత్తమునేరిగి సత్క్రియలే చేయుమా(2)
 క్రీస్తు వలె బ్రతుకుతు నీవు నిత్యజీవమొందుమా ||చేజారితే||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...