Showing posts with label Maha mahimatho nindina. Show all posts
Showing posts with label Maha mahimatho nindina. Show all posts

07 June 2024

Maha mahimatho nindina మహామహిమతో నిండిన కృపా

మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా
ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా
నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్య

1. మహిమను విడిచి భువిపైకి దిగివచ్చి - కరుణతో నను పిలిచి
సత్యమును బోధించి చీకటిని తొలగించి - వెలుగుతో నింపితివి
సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక
స్థిరపరచి నీ కృపాలో నడిపించువాడవు ||మహామహిమతో||

2. కరములుచాచి జలరాసులలోనుండి - నను లేవనెత్తితివి
క్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినము కాచితివి
అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు
నిర్మాలుడా భాహువు చాపి దీవించువాడవు ||మహామహిమతో ||

3. పదివేలలోన గుర్తించదగిన - సుందరుడవు నీవు
అపరంజి పాదములు అగ్ని నేత్రములు - కలిగిన వాడవు
ఉన్నతుడా - మహోన్నతుడా ఆరాధించెదను
రక్షకుడా - ప్రభాకరుడా నిను ఆరాధించెదను ||మహామహిమతో ||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...