Showing posts with label చెట్టి భానుమూర్తి. Show all posts
Showing posts with label చెట్టి భానుమూర్తి. Show all posts

22 March 2022

Kalavari mettapai kalavara mettido| కలవరి మెట్టపై కలవర మెట్టిదొ

201           యేసు శాంతికరుడు
రా- శ్యామ (ఛాయ: శాతము లేక) తా - ఆది

కలవరి మెట్టపై - కలవర మెట్టిదొ - సిలువెటులోర్చితివో - పలుశ్రమ లొందినీ - ప్రాణము బెట్టితి ||కల||

1.తులువలుజేరినిన్ - తలపడి మొత్తిరో -  అలసితి సొలసితి - నాత్మను గుందితి ||కల||

2.పాపులకొరకై - ప్రాణముబెట్టితి - ప్రేమ ది యెట్టిదో - నామదికందదు ||కల||

3.దారుణ పాప - భారము మోసితి -  దీనుల - రక్షణ దానమైతివి గద ||కల||

4.జనకున భీష్టమున్ - జక్కగ దీర్చితి - జనముల బ్రోవనీ -;జీవము నిచ్చితి ||కల|| 

5.శాంతిని గోరి ది - శాంతముల్దిరిగిన - భ్రాంతియె గాని వి -  శ్రాంతెవరిత్తురు? ||కల||
                – చెట్టి భానుమూర్తి.

20 August 2021

Idigo Neethi Bhaskarundu | ఇదిగో నీతి భాస్కరుండు

84          
నీతి సూర్యుఁడు
రా – బేహాగ్,  తా – ఏక
          
ఇదిగో నీతి భాస్కరుండు - ఉదయమాయె నతని నీతి హృదయ కమలమునను నిలిచి = మది తమో గుణంబులణపై - సదమల జ్ఞానంబు నొసఁగె ||ఇదిగో||

1.ఎవని జ్ఞానమహిమ విభవ - మెవనినీతి బలప్రకాశ - మెవని మనుజ రూపమాయె = నవవినీత సత్యవర్తి రవినిమించు తేజమూర్తి || ఇదిగో ||

2.నరజనముల నీతియెవడో - ధరణిపతుల దీప్తియెవడో – దురితఋణము దీర్చునెవఁడో = పరమపురుషు డేసుఁడతఁడె - నిరతజీవ మొసగునిపుడె || ఇదిగో ||

3.కలుష మెల్ల బాపదలఁచి - కలువరి గిరివరకు నడచి - యలవికాని ముక్తి గూర్చన్ = సిలువమీద బలియై మరణ - బలమునణఁచి తిరిగిలేచె||ఇదిగో||

4.మదితమం బదెచటికరిగె - యెదను కఠినతనము కరిగె - హృదయరసము లతిశయించి = సాధుగుణముగలిగి యేసు - పాదములను గొలుతు నిపుడె || ఇదిగో॥

5.జనగణముల జీవమతఁడె - ధనఘనముల దాతయతఁడె - యనుభవమున నెఱుఁగుమతని = యనుపమ ప్రేమా మృతంబు - ననవరతా నందకరము || ఇదిగో ||
                            – చెట్టి భానుమూర్తి

Sarva loka sanpujya namonama | సర్వ లోక సంపూజ్యా

87
క్రీస్తుకు నమోనమః
రా – శంకరాభరణము, తా – అట

1.సర్వ లోక సం పూజ్యా - నమోనమో - సర్వ జ్ఞాన సంపూర్ణా - నమోనమో - సర్వ సత్య సారాంశా - నమోనమో - దేవా గావో ||

2.దీన భక్త మందారా - నమోనమో - దోష శక్తి సంహారా - నమోనమో - దేవ యేసావతార - దేవా గావో ||

3.దేవలోక ప్రదీపా - నమోనమో - భావలోక ప్రతాపా - నమోనమో  పావనాత్మ స్వరూపా - నమోనమో - దేవా గావో ||

4.వేదవాక్యాదర్శ నావె - నమోనమో - వేద జీవమార్గం బీవె  - నమోనమో - వేదవాక్కును నీవే - నమోనమో - దేవా గావో ||

5.శాపగ్రహివైతివి నాకై - నమోనమో - ప్రాణత్యాగివైతివి నాకై - నమోనమో - ప్రాయశ్చిత్తమైతివి నాకై - నమోనమో దేవా గావో ||
    - చెట్టి భానుమూర్తి

Yesu Padaanbuja Sharanam | యేసు పదాంబుజ శరణం

92  
యేసు శరణు
 రా – జంఝూటి, తా – ఆది
                 
యేసు పదాంబుజ శరణం - నర - దోష మహాంబుధి - హరణం = యేసే మార్గము యేసే సత్యము - యేసే జీవము యేసుకు - శరణం ||

1.దేవకుమార శరణం - నర - జీవప్రదాత శరణం = దేవదేవ జగదావతారమము - బ్రోవరావె ప్రభు నీవే - శరణం ||

2.పాపవినాశక శరణం - నర శాపవిమోచక - శరణం = పావనాత్మ భవదీయ ప్రాణమిడి - ప్రాపువైతివో ప్రభువా - శరణం||

3.పరమపురుషుడా శరణం - ఓ - నిరుపమప్రేమడ - శరణం = మరణ మొంది మరి మృత్యుంజయుడై - పరమున జరిగిన ప్రభువా - శరణం||

4.నీతిపూర్ణమా శరణం - జగ - జ్యోతి రత్నమా - శరణం - జాతిభేదరాహిత్యుడ హితుడా - నీతి ప్రబోధక నీవే శరణం||

5.తేజోమూర్తికి శరణం - విభ్రాజిత కీర్తికి - శరణం = రాజరాజ యో భారత రాజ్య - ప్రజాత్మ రక్షక ప్రభువా - శరణం||
                                    - చెట్టి భానుమూర్తి

19 August 2021

Devaathma Jayo Deenadayalu | దేవాత్మ జయో దీనదయాళూ

93 
యేసు దీనదయాళుడు
రా - మాయామాళవగౌళ,  తా - ఆది
                     
దేవాత్మ జయో దీనదయాళూ పావనాత్మ - మము బ్రోచితహో - నీవే గదా మా - నిజరక్షణకై జీవవాయ ధర - జేరితహో ||

1.సుగుణాత్ములలో - సుగుణము నీవే నిగమము లెరుగని - నీతివహో = సుజనాత్ముల కిల - సుజ్ఞానాత్మవు - సవినయ భక్తికి సారమహో ||

2.పేదలలో నిరు - పేదపు నీవే సాధులలో ఘన - సాధువహో = మోదమలర మా - ముక్తిని గూర్చిన - సాధు పేదజన సోదరహో ॥

3.దీనాత్ములలో - దీనుడవై భవదీయ దయారస - ధారలహో = దినదిన మొసగిన - దేవాత్మజ యిమ్మాను యేలు వం - దనములహో ॥

4.పరమ పూజ్యుడా - పరిమిత ప్రేమాభరితుడ సంస్థవ - పాత్రుడహో = నిరతము నిన్నేమరక - నుతిం - చెద నరజన గణముల - నేస్తడహో ॥
   – చెట్టి భానుమూర్తి.

07 March 2021

Kalavari Mettapai Kalavaramettido | కలవరి మెట్టపై కలవరమెట్టిదొ

201
యేసు శాంతికరుడు 
రా - శ్యామ, తా - ఆది 
చాయ : శాంతము లేక

కలవరి మెట్టపై - కలవరమెట్టిదొ - సిలువెటులోర్చితివో - పలు శ్రమ లొంది నీ - ప్రాణము బెట్టితి

1.తులువలు జేరి నిన్ - తలపడి మొత్తిరో - అలసితి సొలసితి - వాత్మను గుందితి ||కలవరి||

2.పాపుల కొఱకై - ప్రాణము బెట్టితి - ప్రేమది యెట్టిదో - నామది కందదు ||కలవరి||

3.దారుణ పాప - భారము మోసితి - దీనుల రక్షణ దానమైతివిగద ||కలవరి||

4.జనకు నభీష్టమున్ - జక్కగ దీర్చితి - జనముల బ్రోవ నీ - జీవము నిచ్చితి ||కలవరి||

5.శాంతిని గోరిది - శాంతమున్‌రిగిన - భ్రాంతియె గాని వి - శ్రాంతెవ రిత్తురు? ||కలవరి||
  - చెట్టి భానుమూర్తి

23 August 2020

Prabhalamugane prasthutincheda | ప్రబలముగనే ప్రస్తుతించెద

9
స్తుతి గీతము
రా - శంకరాభరణము, తా - ఏక 

ప్రబలముగనే - ప్రస్తుతించెద - ప్రభుని కృపలన్ని = ప్రతి దినము నిను - ప్రచుర పరచెద - ప్రభుడ నావిభుడా ||ప్రబల||

1.పొందుగోరి నా - యందు నిలిచిన - బంధు మిత్రుడవు = మందమతి కా - నంద మొసగిన - మహిమ తేజుడవు ||ప్రబల||

2.చింతదీర్చి - నా భ్రాంతి మార్చితి - వెంత వింతదియో =  స్వాంతమున కడు - శాంతి గూర్చితి వెంత కరుణదియో ||ప్రబల||

3.నీతి కరపిన - జాతి మరపిన - ఖ్యాతి  యేసునిదే =  నీరసుడ నను - గారవించిన -  నీతిరాజితడే  ||ప్రబల||

4.జీవమిచ్చిన - జానవచ్చిన - దేవసుత నీవే =  జీవదాయక - బ్రోవరా యిక - జాల  మేలనురా ||ప్రబల||

5.నిమిష నిమిషము - నిను భజించెద - నెమ్మణంబునను = శమదమాది - సుగుణశోభిత -  సమ్మదిని నిమ్మా ||ప్రబల||
                               – చెట్టి భానుమూర్తి
________________________________
Prabhalamugane - prasthutincheda -  prabhuni krupalanni = prathi dinamu ninu - prachura  paracheda - prabhuda naavibhuda  ||Prabha||

1.Pondhugori naa - yandu nilichina - bandhu = mithrudavu mandamathi kaa - nanda  mosagina - mahima thejudavu ||Prabha||

2.Chintha deerchi - naa bhranthi marchithi - ventha vinthadiyo = swanthamuna kadu -shanthi gurchithi - ventha karunadiyo  ||Prabha||

3.Neethi karapina - jaathi marapina - khyathi yesunide - neerasuda nanu - gaaravinchina - nithiraajithade ||Prabha||

4.Jeevamichina - jaana vachina - devasutha neeve = jeevadayaka - bhrovara  yika - jaala melanura ||Prabha||

5.Nimisha nimishamu - ninu bhajincheda - nemmanambunanu = shamada maadi - suguna shobhitha - sammadini imma  ||Prabha||
                         - Chetti Bhanumurthi
DOWNLOAD MP3 SONG HERE 👇

11 July 2020

Samanulevaru prabho | సమానులెవరు ప్రభో

94
యేసునకు సమానులెవరు ?
రా – శంకరాభరణము,  తా - ఆది
                   
సమానులెవరు ప్రభో - నీ - సమానులెవరు ప్రభో = సమస్త మానవ - శ్రమాను భవమున్ - సహించి వహించి - ప్రేమించగల నీ ||సమాన||

1.సమాన తత్వము - సహోదరత్వము = సమంజసము గాను మాకు దెలుప నీ ||సమాను||

2.పరార్ధమై భవ - శరీర మొసగిన = పరోపకారా - నరావతారా ॥సమాను||

3.దయా హృదయ యీ - దురాత్ము లెల్లరిన్ = నయాన భయాన - దయాన బ్రోవ నీ ||సమాను||

4.ఓ పావనాత్ముడ - ఓ పుణ్య శీలుడ = పాపాత్ములను బ్రోవ - పరమాత్మ సుతనీ ||సమాను||
- చెట్టి భానుమూర్తి
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...