Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

21 March 2026

E reethi Sthuthiyinthuno ఏ రీతి స్తుతియింతునో


ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో
నేరములెంచని వాడా – నాదు నజరేయుడా
తీరము దాటిన వాడా – నాదు గలలీయుడా
నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివి
నేను నీ వాడనో యేసువా ||ఏ రీతి||

వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివిరోత బ్రతుకును మార్చితివి – నీదు సుతునిగ జేసితివి (2) ||నా ప్రాణ||

మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివి
సకల సంపద విడిచితివి – సేవకునిగా మారితివి (2) ||నా ప్రాణ||

ఇంత ప్రేమకు కారణము – ఎరుగనైతిని నా ప్రభువా
ఎన్న తరమా నీ ప్రేమ – సన్నుతించుచు సాగెదను (2) ||నా ప్రాణ||

21 February 2024

Ea reetiga kolicheda ఏ రీతిగా కొలిచెద ప్రభు

ఏ రీతిగా కొలిచెద - ప్రభు నీ సేవలో నిలిచెద 

ఏ రీతిగా కొలిచెద - ప్రభు నీ సేవలో నిలిచెద ఇదే ఆశ మదిలో అనుదినం ఇదే నా ప్రపంచం అనుక్షణం సదా యేసు నీలో బ్రతికెద
ఏ రీతిగా కొలిచెద - ప్రభు నీ ప్రేమలో నిలిచెద

1. నీ మమతే - అమూల్యమైనదీ
ఊహలకే - అతీతమైనదీ
నా గతం - ఓడించగా
నీ దరే - చేరానుగా
పాపములో నన్ను - విడనాడక
విమోచించినా - నిజ దైవమా
ప్రార్ధనలే నాలో - ఫలియించగా
ప్రతీ శ్వాసలో - ప్రభవించవా
నీ ప్రేమ ఇలలో - పాడెద - నిరతం దేవా

2. నీ వరమే - విశేషమైనదీ
వాక్యముగా - వసించుచున్నదీ
నీ స్వరం - నా దీపమై
నీ బలం - ఆధారమై
ఆశ్రయమైనావు - కలకాలము
కృపాసాగరా - స్తుతి పాత్రుడా
శాశ్వత నీ ప్రేమ - వివరించుట
ఎలా సాధ్యమూ - ప్రియ యేసయా

12 November 2023

Emivvagalanayya Naa Yesayya ఏమివ్వగలనయ్య నా యేసయ్యా


ఏమివ్వగలనయ్య నా యేసయ్యా - నీవు చేసిన మేలులకై (2)
నిన్ను గూర్చి లోకమంత చాటనా - ఊపిరి ఉన్నంత వరకు పాడనా (2) ||ఏమివ్వ||

1.గురి లేని నా జీవిత పయనంలో - దరి చేరి నిలచిన నా దేవుడవు
మతి లేక తిరుగుచున్న నన్ను - శృతి చేసి నిలిపిన నా దేవుడవు
ఎందుకింత నాపైన ఈ ప్రేమ - వర్ణించలేను నా యేసయ్యా (2) ||నిన్ను గూర్చి||

2.ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ - నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా
నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా - నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా
ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా - నీ పాత్రగా నన్ను మలచినందుకు (2) ||నిన్ను గూర్చి||

12 March 2023

Edho aasha naalo lyrics | ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ

ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ (2)
యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ 
మితిలేని ప్రేమ చూపించినావు 
శృతి చేసి నన్ను పలికించినావు 
ఈ స్తోత్రగానం నీ సొంతమే
 
1.పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము
పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము (2)
తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక
కరుణామయా నా యేసయ్య
 
2.నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా
నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన (2)
ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును 
నీ కార్యము చూపింతును నీ శాంతము తేజోమయా నా యేసయ్య

02 March 2023

Edo asha nalo neethone| ఏదో ఆశ నాలో నీతోనే| Stotraganam | స్తోత్రగానం

Stotraganam - స్తోత్రగానం Hosanna Ministries 2023 new Album Song-4

ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ (2)
ఏరై పారే ప్రేమా నాలోనే ప్రవహించని మితిలేని
ప్రేమా చూపించినావు శ్రుతిచేసి నన్ను
పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే||ఏదో||
 
1.పరవాసినైనా కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము (2)
తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక కరుణామయా నా యేసయ్యా ||ఏదో||
 
2.నీపాద సేవ నే చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదనా "2" ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము
చూపింతును నీ శాంతము తేజోమయా నా
యేసయ్యా ||ఏదో||

20 November 2022

Ae deshasthulamaina ae jaathi | ఏ దేశస్థులమైన ఏ జాతి

549
క్రీస్తునందు బాలలు ఒక్కటే
రా - యదుకులకాంభోజి, తా- త్రిపుట 
(చాయ: తనువు నాదిదిగో)

ఏ దేశస్థులమైన - ఏ జాతి మనదైన - యేసులో మన మొక్కటే = ఏకమై బాలల మెల్లరమును తండ్రి - నెంతో స్తుతించుచు నెప్పుడు బాడుదము ||ఏ||

1.పలు దేశములలోన పన్నుగ దేవుని - ప్రార్ధించెడి బాలలం = పరమ తండ్రీ మాలో - ప్రతివారి దీవించు - బహుగా నీ దినమనుచు - బ్రతిమాలి వేడుదము ||ఏ||

2.బహు దేశములలోన - పలువిధుములగు పనులు - పరగజేసెడి బాలలం - ప్రభుడే యేసుని కొఱకే - ప్రపంచమంతటిని - బాగుచేయను మిగుల - ప్రయాసపడుదము ||ఏ||
- సి. విజయ చార్లెస్ 

17 July 2022

Emi ledu sumi jagamulo | ఏమి లేదు సుమీ జగములో

175
క్రీస్తు ప్రేమ సాటిలేనిది
రా - మారువ, తా - అట
(చాయ: ఉన్న పాటున వచ్చు)

ఏమి లేదు సుమీ జగములో యేసుని - ప్రేమ సారము కన్నను = ¹పామరం బేటికి వృధా ²కను - దామరలు మూయగనె చీకటి - యౌ మనంబున నెల్ల సత్యము - గామి గని సర్వంబు విడువుఁ ||డేమి||

1.³దార పుత్రాది బంధు ⁴శ్రేణిపై మమ - కార భావము జెందుచుఁ - దద్విషయమై - కోరి దుఃఖము లొందుచు - భ్రమఁ గుందుచు = భూరి మాయా జాల బంధా - కర మిది యని తెలియ కీ సం - సార మంతయు నాది నాదని - యూరకే చెడిపోవ నేటికి ||నేమి||

2.ఈ దేహమునకుఁ బ్రాణమునకు సంబంధ - మించు కైనఁ గలదా - దేహాత్మలకు - భేదము గన వలదా - బుద్ధి గొన వలదా = యాది నే దేహము - నాత్మ ⁶స మాదరంబున నుండు నా తను - వీ ధరిత్రిని విడచి చను నపుడే ⁷దయామృతవార్ధి దిక్కగు ||నేమి||

3.⁸జాయా పుత్రోద్యాన ⁹గృహ విత్తా ట్టాలక - సకల వస్తు జాలము - ¹⁰ప్రతిష్ఠాను - భూతి విధేయులు - నఖిల సంపదలు = నీ యవని లోపల సమర్పణఁ - జేయఁగా బడుఁ గాని యించుక - ¹¹తోయమును గొని పోవశక్యము - లేద హా భ్రమ నొంద నేటికి ||నేమి||
   – విలియం డాసన్ 
________________________________ 
¹మోహము, ²పద్మమువంటి కన్నులు, ³భార్య, ⁴సమూహము, ⁵వలతాళ్ళవంటిది, ⁶మిగుల నాదరణయందు, ⁷దయారసమునకు సముద్రమువంటివాడు, ⁸భార్య, ⁹కోటవాకిటి మీది యిల్లు, ¹⁰అనుభవమునకు, ¹¹జలమును.

05 July 2022

Em korukonu neeve nakundaganu | ఏం కోరుకోను నీవే నాకుండగాను

ఏం కోరుకోను నీవే నాకుండగాను యేసూ (2)
వేరై నీకు నేను - క్షణమైనా బ్రతకలేను (2)
కలిమికి నెలవగు నిను కలిగిన నేనేంకోరుకోను నీవే నాకుండగాను

నిర్మించావు నీనోటి మాటతో - భూమ్యాకాశములను (2)
రూపించి నరుని హెచ్చించావు - నియమించి ఏలుటకును (2)
చెలిమికి తులువను నను పిలిచిన - నిన్నేంకోరుకోను నీవే నాకుండగాను

పంపించావు ఏకైక పుత్రుని - పాప లోకమునకు (2)
చెల్లించి ఋణము అర్పించావు - తన ప్రాణం మరణమునకు (2)
నను కనుగొని కలుషము కడిగిన 
నిన్నేంకోరుకోను నీవే నాకుండగాను

పోషించావు లోటేమి చేయక తోడై నేటివరకు (2) 
దర్శించి కరము అందించావు నను ఆదుకొనుట కొరకు (2)
మొరలను విని ఎదురుగ నిలిచిన - నిన్నేంకోరుకోను నీవే నాకుండగాను
వేరై నీకు నేను - క్షణమైనా బ్రతకలేను (2)
కలిమికి నెలవగు నిను కలిగిన నేనేంకోరుకోను నీవే నాకుండగాను

10 June 2022

Ae reethi nee runam ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు

ఏ రీతి నీ ఋణం - తీర్చుకొందు యేసయ్యా (2)
ఏ దిక్కు లేని నన్ను - ప్రేమించినావయ్యా
ఎంతో కృపను చూపి - దీవించినావయ్యా ||ఏ రీతి||

1.పాపాల సంద్రమందున - పయనించు వేళలో (2)
పాశాన మనసు మార్చి - పరిశుద్ధుని చేసావయ్యా ||ఏ రీతి||

2.నా పాప శిక్ష సిలువపై - భరియించినావయ్యా (2)
నా దోషములను గ్రహియించి - క్షమియించినావయ్యా ||ఏ రీతి||
– తాటపూడి జ్యోతి బాబు
_______________________________
Ae reethi nee runam - theeerchukondu yesayyaa (2)
Ae dikku leni nannu preminchinaavayyaa
Entho krupanu choopi deevinchinaavayyaa ||Ae Reethi||

Papaala sandramanduna payaninchu velalo (2)
Paashaana manasu maarchi parishuddhuni Chesaavayyaa ||Ae Reethi||

Naa papa shiksha siluvapai bhariyinchinavayya (2)
Naa doshamulanu grahiyinchi Kshamiyinchinaavayyaan ||Ae Reethi||

30 May 2022

Edi minna edi sunna | ఏది మిన్న ఏది సున్న తెలుసుకోరా

ఏది మిన్న ఏది సున్న తెలుసుకోరా క్రైస్తవుడా 
నిన్ను గన్న యేసు కన్న ఎదిలేదురా లోకాన (2) హల్లెలూయా హల్లెలూయా (2) 

1.మతాధిపతి కన్న శతాధిపతి మిన్న - 
సంచిలో ధనముకన్న సమాధానమే మిన్న (2)
హన్న ప్రార్ధనలో ఉన్న ఆశయం ఎంతో మిన్న - అందలమెక్కుట వలదన్న అంగలార్చుటయే మిన్న(2) ||ఏది మిన్న||

2.బుద్ధిహీనుల పాటకన్న జ్ఞానుని గద్దింపె మిన్న (2) గర్విష్టునితో పోత్తుకన్న ధీనుని సాంగత్యమే మిన్న పైకి భక్తిగల వానికన్న లోపల శక్తిగల వాడెమిన్న సుఖాశక్తి గల వానికన్న శ్రమల పాలగుటయే మిన్న ||ఏది మిన్న||

22 May 2022

Enaatido ee bandam naa yesutho | ఏనాటిదో ఈ బంధం నా యేసుతో

ఏనాటిదో ఈ బంధం - నా యేసుతో అనుబంధం -
ఆశ్చర్యమే నా జీవితం - ఊహించలేదు ఎన్నడూ ||ఏనాటిదో||
 
1.నీ రక్త సంబంధముతో - పరిశుద్ధ కుటుంబములో -  నన్ను చేర్చిన ప్రేమ సాగరా (2)
ఎనలేని నీ ప్రేమకు - నా పాదాభివందనం (2) ||ఏనాటిదో||
 
2.తెరచాపవంటి జీవితం - లోక ప్రేమ సుడులో మధ్యలో - నలుదిశలా కృంగుతున్న వేళా (2)
నిజమైన నీ ప్రేమతో నను - నీ దరికీ చేర్చినావే ||ఏనాటిదో||
DOWNLOAD MP3 SONG HERE 👇

Enaatido ee bhandamu enni | ఏనాటిదో ఈ బంధము ఎన్ని తరాలదో

ఎనాటిదో ఈ బంధము 
ఎన్ని తరాలదో ఈ బంధము 
పేగు బంధంకన్నా రక్త బంధంకన్నా 
నాతో పెనవేసుకున్న ఆత్మబంధమేమిన్నా 
ఓ మనసా నీకుతెలుసా ఆ బంధం యేసయ్యేనని

1.కొలతే లేని మమతలతో అరుదించి 
రక్షణ బాగ్యము తెచ్చిన ఆ వేదనె మిగిలిందీ 
శత్రు సైన్యమే చుట్టిన ప్రేమతో పలకరించిందీ
నా మరణము తప్పించీ సిలువనూ మోసిందీ 
నాకై సిలువ మోసిందీ 
ఎంత గొప్పదో నా యేసుని బంధం 
ఎంత గొప్పదో ఈ ఆత్మ బంధం

2.మనసే లేనిమనుషులతొ జీవించీ 
వెన్నుపోటు పొడిచినా చిరునవ్వే చిందించి 
గుండెకోత నే కోసినా తన ప్రేమనే విరజిమ్మిందీ 
తన ప్రాణము వెచ్చించీ ప్రాణము పోసిందీ 
నాకై ప్రాణం పోసిందీ

20 May 2022

Yelativaado kaani yee yesuni | ఏలాటివాఁడో కాని యీ యేసుని

156 
క్రీస్తు తుఫానును నిమ్మళపర్చుట
రా – ముఖారీ,  తా - త్రిపుట
 
ఏలాటివాఁడో కాని - యీ యేసుని - నేమని వివరింతుము = గాలివాన యేసుని - గద్దింపునకుఁ చాల భయపడి నిలిచెను ||ఏలాటి||
 
1.ముద్దు శిష్యులతోడను - సముద్రపు - టద్దరికి వెళ్లెను = కొద్ది పడవనెక్కెను - ఇంతలోనె - పెద్దగాలి రేగెను ||ఏలాటి||
 
2.అల్లకల్లోలముగా - సముద్రము - అల్లలాడు నప్పుడు = చల్లఁగ దోనె వెనుక - తలగడపైని - మెల్లన నిదువోయెన్ ||ఏలాటి||
 
3.చింత లేదా యేమయ్యా - బోధకుఁడా న - శించిపోవుచున్నాము = ఎంతో వేదన పడితిమి - కాపాడుమ - టంచు శిష్యులు లేపిరి ||ఏలాటి||
 
4.దిగ్గునఁ బ్రభువు లేచి - యా గాలిని - గద్దించిన వెంటనే = తగ్గి నిమ్మళించెను - సమస్తము - సద్దు ఉడిగిపోయెను ||ఏలాటి||
 
5.ఏల భీతు లైతిరి - యింతలోనే - యెంత నమ్మిక లేదని = యీలాగు నోదార్చెను - యేసు తన - సొంత శిష్యుల నప్పుడు ||ఏలాటి||
                     – తూసిలి బెంజిమిన్

02 March 2022

Emascharyamu priyulara | ఏమాశ్చర్యము ప్రియులారా

184
ఆశ్చర్యకరమైన సిలువ
రా- పున్నాగ తోడి, తా- త్రిపుట 
(ఛాయ:ఎంతో సుందర మైనవి)

ఏమాశ్చర్యము ప్రియులారా - క్రీస్తు మరణము -  ప్రేమజూడరెమనసార = ఆ మహాత్ముఁడు మరణ - మగు రీతిఁ గనుకొన్న - సామాన్యమగు నొక్క - జనుని చందము గాదు = ఈ మహిని గల పాప జీవుల - పై మహాకృపఁ జూపి నిత్య - క్షేమ మొసఁగెడు కొరకు బలు శ్రమ - చే మృతుండైనాఁడు స్వేచ్ఛను ||ఏమాశ్చర్యము||

2.కొండవలె భారమై - లోక పాపములు - దండింపఁబడె ఘోరమై = నిండు భారము క్రింద - నిలుచున్న వేళను - గుండె దిగులునఁ దనువు - నిండె రక్తపుఁ జెమట = మెండుకొని దుఃఖములతో నా - తండ్రి యీ పాత్రమును నా కడ - నుండి తొలగించుటకు మనపై - యుండినను జేయమని వేఁడెను ||ఏమాశ్చర్యము||

3.కడు దుర్మార్గులచేతను - క్రీస్తుఁడు పట్టు - వడె దానంతట తాను = చెడుగు లెందరు నింద - జేసి మోముపై ¹నుమిసి - వడిముళ్లతో నల్లఁ - బడిన కిరీటము = ²తడయ ³కౌదల బెట్టి కరముల - నడుగులను సిలువ నిడి మేకులు - ⁴దొడిపి ప్రక్కను రక్తజలములు - ⁵దొరగ ⁶గుంతము గ్రుచ్చి రహహా ||ఏమాశ్చర్యము||

4.ఇరు ⁷పార్శ్యముల నిద్దరి - దొంగల - నునిచి మరణావస్థలఁ బెట్టిరి = నిరపరాధి ప్రభువు - దురితాత్ము లొనరించు - తరుచు బాధల కోర్చి - మరి వారిఁ గరుణించి = యెరుఁగ రేమి యొనర్తురో యీ - దురిత జీవులు వీరి నోహో - పరమ ⁸జనక క్షమించు మని తన - ⁹యరుల కొరకై వేఁడు కొనియెను ||ఏమాశ్చర్యము||
                         – పురుషోత్తము చౌదరి
_________________________________
¹ఉమ్మివేసి. ²ఆలస్యముచేయక. ³తలమీఁద. ⁴గ్రుచ్ఛి. ⁵దొర్లునట్లు. ⁶ఈటె. ⁷ప్రక్కల. ⁸తండ్రీ. ⁹శత్రువులు 

04 December 2021

Elayanaga Manaku Shisuvu | ఏలయనగా మనకు శిశువు


ఏలయనగా మనకు శిశువు పుట్టెను 
మనకు కుమారుడు అనుగ్రహింప బడెను 
ధవళ వర్ణుడు రత్న వర్ణుడు
నిత్యడగు తండ్రి సమాధాన కర్త

ఆశ్చర్యకరుడు - ఆలోచన కర్త 
పది వేళలో అతి సుందర ప్రియుడు (2)
యెరూషలేము వాడు - బెత్లహేములో 
బాలుడై మన కొరకు - పుట్టినాడు పావనుడు (2) 

పూర్ణశాంతి గలవాడు - సత్య సంపూర్ణుడు 
పశువుల పాకలో పవలించి నాడు - పరిశుద్ధుడు పరిపూర్ణుడు (2)
ఇమ్మాను ఏలినువాడు ఇరుకునుండి తప్పించి దేవుడు 
ఇలవెలుపై జన్మించినాడు - పరిశుద్ధుడు - పరిశుద్ధుడు (2)

కరుణ వాచ్చల్యము గలవాడు - కృపా నిరతుడు
కారణ జన్ముడై కను తెరిచానాడు - కమనీయుడు బల శూరుడు (2)
సీయోను అనువాడు సరల నుండి తప్పించు దేవుడు ఇల జీవమై జన్మించినాడు - రక్షకుడు రక్షకుడు (2)

23 November 2021

Emi leni nannu korukunna | ఏమి లేని నన్ను కోరుకున్నా

ఏమి లేని నన్ను కోరుకున్నా - నేను ఉన్న చోటు చేరుకున్నా 
పావనుండైన ఆ దేవుడు - ప్రేమతో ఇల జన్మించెను పాపితో స్నేహం చెయ్యాలని - యేసు క్రీస్తు తానే మానవుడాయెను ||ఏమి||

1. దూత దేవ దూత శుభవార్త ప్రకటించె 
ధాత శాంతి ధాత ఆగమనం వివరించె 
గాలిలో ఎదో కొత్త పాట సాగెనె హాయినీయగా
గుండెలో ఉన్న భారమంత దూరమై సేద తీరగ సత్యమాయెనే కల ||ఏమి||

2. తార వింత తార తూర్పు వైపు కనిపించె 
జాడ యేసు జాడ విదితము గావించె 
పాకలో ఉన్న తొట్టిలొన బాలుడు పవళించగా
ధన్యురాలైన తల్లి నోట స్తోత్రమే పల్లవించగా వేడుకాయెనే ఇల ||ఏమి||

DOWNLOAD MP3 SONG HERE 👇

ఏ పరిస్థితి నుండి అయినా ఆయన రక్షించగల సమర్థుడు

🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము⛪
 *
✝️ *ఏ పరిస్థితి నుండి ఆయన రక్షించగల సమర్థుడు*✝️

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని  - యెషయా 49:8

బంధింపబడిన ప్రజలకు చీకటిలో ఉన్న ప్రజలకు దేవుడు బలమైన దుర్గము గా ఉంటున్నాడు. ఎటువంటి కష్టంలో, ఏ బాధలో నీవు బంధింపబడి ఉన్న ఆదుకుంటానని సెలవిస్తున్నాడు.ఒక రాజు తన శత్రువుల బారినుండి తప్పించుకోవటానికి ఒక గుర్రమును, ఒక దీపము, తాను పెంచుకుంటున్న పక్షి తీసుకుని ఎడారి ప్రాంతానికి ఎవరికీ తెలియని ప్రాంతానికి వెళుతున్నాడు చాలా చీకటి పడిపోయింది. ఎడారిలో కదలకుండా ఒకేచోట కూర్చుని ఉండిపోయాడు. చాలా భయంకరమైన గాలి రావడం మొదలైంది. ఆ గాలికి దీపం ఆరిపోయింది పక్షి పారిపోయింది పక్షి టపటపా కొట్టుకోవటంలో గుర్రం బెదిరిపోయి పారిపోయింది. అతను ఒంటరిగా ఉండి పోయాడు. ఏదో లైట్ లు దగ్గరికి వస్తున్నట్లు, గుర్రాల చప్పుళ్ళు వస్తున్నట్లు అనిపించి ఆ ఎడారిలో కదలకుండా శబ్దం చేయకుండా పడుకున్నాడు. శత్రు సమూహాలు అతనిపై నుంచి వెళ్లి పోయినవి కాని అతని పై నుంచి వెళ్లి పోయినవి కానీ అతనిని కనుగొన లేకపోయింది ఉదయం చూడగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. శత్రువుల నుంచి తనను కాపాడినందులకు దేవునికి వందనాలు తెలియ పరిచాడు. ఉదయాన్నే తన గుర్రం ఇంకొక గుర్రాన్ని తీసుకువచ్చింది. సంతోషించి తన ప్రయాణాన్ని ముందుకు సాగించాడు, ఎంత గొప్ప దేవుడో చూసారా నీ శత్రువుల నుంచి ఎలా కాపాడాలో, ఏ సమయానికి నీకు ఏది అవసరమో ఎరిగిన దేవుడు, ఆ రాజును కాపాడిన దేవుడు, నిన్ను కాపాడలేడా? నీ జీవితాన్ని తీర్చిదిద్దలేడా?దేవునిని వేడుకో,ఆయనే నిన్ను కాపాడి, నీ కష్టాలన్నీ తీరుస్తాడు, అటువంటి అనుకూల సమయం దేవుడు నీకిచ్చే వరకు ఎదురు చూస్తూ దీవెన పొందుకో.. 

 🛐*ప్రార్థన:-*🛐
 నా రక్షకా! నీ నీడలో నన్ను నడిపించి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, వాటి నుండి నన్ను తప్పించి కాపాడి నడిపించుమని యేసు క్రీస్తు నామములో తండ్రి. ఆమెన్!

03 September 2021

Ye Naamamulo Srushti | ఏ నామములో సృష్టి అంత


ఏ నామములో సృష్టి అంత సృజింపబడెనో 
ఆ నామమునే స్తుతింతును 
ఏ నామములో పాపమంతా క్షమించబడునో 
ఆ నామమునే పూజింతును 
ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెనో
ఆ నామమునే నమ్మెదను 
ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో 
ఆ నామమునే స్మరింతును 

నీ నామమునే ధ్వజముగ
పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే నా జయము

1. రోగము తలవంచును నీ నామము యెదుట 
శాపము తలవంగును నీ నామము యెదుట 
సాటిలేని నామము - స్వస్థపరచే నామము 

2. ప్రతి మోకాలు వంగును నీ నామము యెదుట 
ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత 
శ్రేష్టమైన నామము - శక్తిగలిగిన నామము 

హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్య
కీర్తింపబడును గాక నీ నామము యేసయ్య కొనియాడబడును గాక నీ నామము యేసయ్య 
అన్ని నామములకు పై నామముగ

20 August 2021

Emi Nenu Samrpinthu Yesu ఏమి నేను సమర్పింతు యేసూ

86
యేసున కేమి సమర్పించుదును?
రా – ఆనందభైరవి,   తా – అట
                   
ఏమి నేను సమర్పింతు - యేసూ - యెట్లు నిన్ను స్తుతియింతు = ఏమి సమర్పింతు - హీనుఁడ నగు నేను - గామితార్థము లెల్ల - గలుగఁజేయు నీకు || నేమి ||

1. నేను మార్గముఁ దప్పియుండఁగ - నన్ను - నీవు కంటివి కరుణ నిండఁగ = దీనపాపులను - దృఢముగఁ బ్రోవను - దాన మిచ్చితివి - తనర నీ ప్రాణము|| నేమి ||

2. అందరి కొఱు కీవు తెచ్చిన - మిగుల - అందమైన నిత్య రక్షణ = అంది నిన్ను - పొందుగఁ జేసెద - నొందు మా నా నుతి - నుత్తమ ప్రభు క్రీస్తు || మేమి ||

3. నీ యందే యానంద మొందఁగ యేసు - నీదైన యాత్మ నాకందఁగ = జేయు మంచు నీకుఁ జేసెదఁ బ్రాణాన - నాయందు దయచేసి నా మనవి నాలించు || మేమి ||

4. నేను జేసిన యఘము లెల్లను - గర్త - నీ యెదుటఁ దలంచు కొందును = నేను సిగ్గు నొంది - నిజముగఁ గుందుచు నేను - వేఁడుకొందు - నీ  క్షమాపణ కొరకు || నేమి ||

5. నన్ను నీవు స్థిరపరచుము - కర్త - యన్నిట నను బలపరుచుము = తిన్నని మార్గమున - దృఢముగ నేగుచు - నిన్ను నే స్తుతియింతు - నిండుగ నెల్లప్పు || డేమి ||
        – పులిపాక జగన్నాధము

28 May 2021

Ye Reethi Sthuthiyinthunu | ఏ రీతి స్తుతియింతును ఓ యేసు


ఏ రీతి స్తుతియింతును - ఓ యేసు నాధా దైవమా 
ఏ రీతి వర్ణింతును - నీ ప్రేమ మధురంబును 
నీ కృప లన్ని తలపోసుకొనుచు - నీ పాదాలు చేరానయ 
నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో- నా కన్నీళ్లు మిగిలాయయా ||ఏ రీతి||

1.ఏకాకినై నే దుఃకార్తిలో- ఏ తోడు గానని నాతో -
ఏమవుదునో ఎటుపోదునో - ఎటుతోచక నున్న నన్ను(2)
ఏ భయము నీకేలయనుచు - అభయంబు నిచ్చావయ్యా 
ఏ దారి కనబడని వేళ - నీ ఒడిలో ఓదార్చావయ్యా ||ఏ రీతి||

2.ఈ మనుష్యులు ఈ వైద్యులు - ఎన్నెన్ని చేసిన గాని 
నా ప్రాణము నా దేహము - నీ స్వాధీనంబే కదయ్యా (2)
నా స్వామి నాతోనే ఉండి - నా కాపరిగ నిలిచావయ్యా 
నాకేమి స్పృహ లేక ఉన్నా - నీ ఊపిరిని పోసావయ్యా ||ఏ రీతి||

3.నీ ప్రేమను నీ పేరును - నేనెన్నడూ మరువలేను -
నీ కరుణను నీ జాలినీ - ఏ మనిషిలో చూడలేను (2)
నిజ దైవము నీవే యనుచు - నీ వైపే నే చూచానయ్యా
యెహోవ రాఫా నేననుచు - ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ||ఏ రీతి||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...