Showing posts with label Radio songs 1970. Show all posts
Showing posts with label Radio songs 1970. Show all posts

26 May 2021

Yesunaadha Rarara Maa Jeevanaadha | యేసునాధా రారారా మా జీవనాధా

537
యేసునాధా, రమ్ము 
రా - శహన, తా- ఏక 

యేసునాధా రారారా - మా జీవనాధా - రారారా ||

1. దోసములు బాప నీవు - వాసిగ జన్మించినావు ||యేసు||

2. నీచులను ప్రేమించి - నీ కరుణఁ జూపినావు ||యేసు||

3. నీతిలేని వారి కెల్ల - నిత్యజీవ మిచ్చినావు ||యేసు||

4. పొందరాని కష్టములను - బొంది యుంటివి తండ్రి ||యేసు||

5. లోకపాపమును జయించి - లోకుల రక్షించితివి ||యేసు||

6. వేడుకతోడ మేము - వేఁడుకొందుమో తండ్రి ||యేసు||
 ఫిలిప్ బెంజమిన్
DOWNLOAD MP3 SONG HERE

Paapini Yesu Prabhu Ne | పాపిని యేసు ప్రభో నే పాపిని

పాపిని యేసు ప్రభో నే పాపిని యేసు ప్రభో
నీ రక్తపు ధారలచే నను కడుగుము యేసుప్రభో

1. పాపము మోసితివే – నా శాపము బాపితివే
నీ మహిమకు పిలచితివే – నీకు స్తోత్రము యేసు ప్రభో

2. చిందిన రక్తమున – నే పొందిన స్వస్థతను
రా నంటిని నీ దరికి – మన్నిచుము యేసు ప్రభో

3. మంటిని యేసు ప్రభో – కనుగొంటిని నీకృపను
రా నంటిని నీదరికి – నను గావుము యేసు ప్రభో
DOWNLOAD MP3 SONG HERE 👇

25 May 2021

Oh jeeva jalarasi Yesuva | ఓ జీవజలరాశి యేసువా

ఓ జీవజలరాశి యేసువా నీ జీవ జలధార గ్రోలితిన్ 
ఏ దారి కానక ఈ అడవిలోన ఆయాస మొందంగ దాహంబుతో (2)
                                           ||ఓ జీవజలరాశి||
1. జీవామృతంపు ఊటగా - చావొందు లోకాన ప్రవహింపగా (2)
జీవచ్ఛవము లా పడియున్న నన్ను - జీవంబు పుట్టించి బ్రతికించినావా (2)
                                             ||ఓ జీవజలరాశి||
2. ఆనంద రాజ్య సమృద్ధివై - ఆనంద వాహినివై ప్రవహించినావా (2)
నీ నిండు దీవెనలు కురిపించి నాలో - ఆనంద భాగ్యాలు పండించుమా (2)
                                             ||ఓ జీవజలరాశి||
3. నే చిన్ని కాలువ భూలోకమందు - నీ జీవాధారలు నను నింపగా (2)
వేలాది జీవులే నీరంబులోన - పరలోక జీవులై జీవింతురు (2)

Kruthagnathan Thalavanchi | కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవము

కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము అర్పింతును 
లేదే యిక నే యీవి యిల - అర్పింతును నన్నే నీకు 

1. దూరమైతి నీ ప్రేమ మరచి - నే రేపితి నీ గాయముల్
    దూరముగ నిక వెళ్ళజాల - కూర్చుండెద నీ చెంతనే (2) ||కృతజ్ఞతన్||

2. ఆకర్షంచె లోకాశలన్ని - లోక మహిమ నడ్డగించు
    కోర్కెలన్ని క్రీస్తు ప్రేమకై - నిక్కముగా త్యజింతును(2) ||కృతజ్ఞతన్||

3. తరముల నీ ప్రేమ నాకై - వర్ణింపను అశక్యము
    నిరంతరము సేవించినను - తీర్చలేను నీ ఋణము (2)|| కృతజ్ఞతన్ || 

4. లోకముకై జీవించనింక - నీ కొరకై జీవింతును 
    నీ కర్పింపన్ నే వెనుదీయన్ - ఈ కొద్ది నా జీవితము (2) || కృతజ్ఞతన్||

5. చింతించితి గత పాపములకై - ఎంతో నేను యేడ్చుచుంటి
కృతజ్ఞతతో సమర్పింతును - బ్రతుకంతయు నీ సేవకై (2) || కృతజ్ఞత||

DOWNLOAD MP3 SONG HERE 👇

Thriyeka Deva Nin Sthuthiyinchuta | త్రియేక దేవ దేవుడు మనకందరికీ

త్రియేక దేవ దేవుడు మనకందరికీ తోడైయుండు గాక 

త్రియేక దేవా నిన్ స్తుతియించుట -
కొనియాడి కీర్తించ మా భాగ్యము (2)

1. మా పాదములను బండపై నిలిపి (2)
    మా అడుగులను నీవు స్థిరపరచినావు 
    మా నోట నూతన కీర్తననుంచి (2)
    నీ సాక్షులనుగా ధర నిలిపినావు 
                                          ||త్రియేక దేవా||
2. మా యెడల జరిగించు ఆశ్చర్యక్రియలు (2)
     మా యెడల నేర్పున్న విస్తార తలపులు 
     వివరింప తరమా కొనియాడ గలమా (2)
     నీ ఘనతలకు సాటి ఎవరైనా కలరా 
                                         ||త్రియేక దేవా||
3. నైవేద్యములను కోరవు నీవు (2)
    బలిఅయిన నీవు కోరుటలేదు
    నీ చిత్తమును ఇల నెరవేర్చవలెనని (2)
    నీ మార్గమను మాకు బోధించినావు
                                         ||త్రియేక దేవా||

Ee Naa Sthithinundi Lepabadi | ఈ నా స్థితినుండి లేపబడి

ఆహా.. హా..హా..హా 
ఈ నా స్థితినుండి లేపబడి - యేసుని ప్రేమను కనుగొంటిని - నే నేసుని ప్రేమను కనుగొంటిని (2)

1. మానవ జాతికి మార్గము చూపి - పాపపు జగతికి ప్రేమను చూపి (2)
భువిపై మనకై శ్రమనోర్చి (2)
పరమును చూపెను ప్రభు యేసు (2)

2. ప్రభు యేసునిలో దొరుకును శాంతి - ప్రభు మాటలతో తొలుగును బ్రాంతి (2)
నడి సంద్రములో నావగా (2)
నడిపించును ప్రభు తోడుగా (2)
DOWNLOAD MP3 SONG HERE 👇

Mana Bhalamaina Devadi Devuni | మన బలమైన దేవాది దేవుని రాజ్యము

మన బలమైన దేవాది దేవుని రాజ్యము - సమీపమౌచున్నది
తన కృపకాలము అతి త్వరితముగా నిల - గతింపనై యున్నది (2)

1. ఆకలి దప్పులుండవచట - వ్యాధి బాధలు లేవచట (2)
విలాపములకు - రోదన ధ్వనులకును - తావులేదచట 
                                     ||మన బలమైన||
2. సంతోష సునాదములు - నీతి సమాధానములు (2)
ఆ రాజ్యమునకు - ఆధారములై అవి - నిలుచు కలకాలం 
                                        ||మన బలమైన||
3. అక్షయ రాజ్యమునీయా - రక్షకుడే నిను పిలువా(2)
 తక్షణమాయన - సైన్యములో చేరి - సాగిపోయెదవా
                                        ||మన బలమైన||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...