Showing posts with label 085 చేరి కొల్వుండి క్రీస్తుని పాదముల. Show all posts
Showing posts with label 085 చేరి కొల్వుండి క్రీస్తుని పాదముల. Show all posts

20 August 2021

Cheri Kolvundi Kreesthuni Paadamula | చేరి కొల్వుండి క్రీస్తుని పాదముల

85
క్రీస్తును కొలుచుట
రా - జంఝూటిి, తా – ఆది
                     
చేరి కొల్వుండి - క్రీస్తుని పాదములఁ - చేరి కొల్వుండి = చేరికొల్వుండి - స్థిరమతితో మీ - నోరు నిండ మది - కోరికఁ దీరం ||జేరి||

1.¹ధీరకలితుఁ డుప - కారకుఁ డితఁ డని - ²యారూఢిగ మదిఁ - గోరి ప్రియమునఁ || జేరి ||

2.జనకుని యుగ్రం - బును దా నోరిచి - జనులకు మేలు నొ - సంగి ఘనునిఁ || జేరి ||

3.³సార చరిత్రో - దారుఁడు   ⁴పాతక - ధీరుఁడు   ⁵శుద్ధా - చారుండితఁడని || జేరి ||

4.దేవుని కొమరుఁడు - ⁶ధీవిస్తారుఁడు - ⁷సేవ కావనుఁడు క్షేమకరుండని || జేరి ॥

5.యేసుని వారల - ⁸నీశుఁడు మన్నన - జేసి తప్పు క్షమ - చేయునుగానఁ ||జేరి||

6.మరణము నొందిన - నరులను  గృపఁ  ⁹గ్ర - మ్మరఁ బ్రతికించిన -  ¹⁰మహిమోజ్వలుని || జేరి ॥

7.పలు దయ్యంబులఁ - బారఁదరిమి రో - గుల రక్షించిన - ¹¹మలినాపహునిఁ || జేరి ||

8.జను  ¹²లచ్చెరు వొం - దను  మూఁగకు నో - రును గన్నులు  ¹³చీ -  కునకిడినాఁ డని || చేరి ||
  - కాజా అనంతము
-----------------------------------
¹ధైర్యవంతుడు. ²నిశ్చయముగా. ³మంచి చరిత్రగలవాడు. ⁴పాపమును జయించువాడు. ⁵పరిశుద్ధమైన గురువు. ⁶మిక్కిలి జ్ఞాని. ⁷సేవకులను రక్షించువాడు. ⁸దేవుడు. ⁹తిరిగి. ¹⁰మహిమతో ప్రకాశించుచున్నవాని. ¹¹పాపమును పోగొట్టువాని. ¹²ఆశ్చర్యము. ¹³గుడ్డి.

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...