Showing posts with label కరుణించవా దేవా కరుణాత్ముడా. Show all posts
Showing posts with label కరుణించవా దేవా కరుణాత్ముడా. Show all posts

16 July 2023

Karuninchava deva కరుణించవా దేవా కరుణాత్ముడా


కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా
నీ ప్రేమలోనే - కావుమా
శ్రమలోన తోడే లేక - శిలనైన కానే కాక వేసారిపోయా యేసయ్య
పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా
నా జీవ దాత యేసయ్య

1.ఆశే నీవై నాలో - నా జీవ గమనములోన
దారే చూపే నాకు - నీ వాక్య వెలుగులలోన
నీలో నివాసమే - నాలోని కోరిక
నీ స్నేహ బంధమే - సంతోష కానుక
నీలో నిరీక్షణే - నా మౌన గీతిక
కాలాలు మారినా - నీవుంటే చాలిక

2. ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా
ధైర్యం నాలో నింపి - నాతోటి నడచిన దేవా
నీ సత్య మార్గమే - నా జీవ బాటగా
నీ నామ ధ్యానమే - నాలోని శ్వాసగా
నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షినై
సాగాలి యేసయ్య - నా జీవితాంతము

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...