Showing posts with label Jeeva swaralu songs lyrics. Show all posts
Showing posts with label Jeeva swaralu songs lyrics. Show all posts

02 June 2021

Gagana Veedhilo Galametti Geethikalu | గగన వీధిలో గళములెత్తి గీతికలు పాడి

గగన వీధిలో గళములెత్తి - గీతికలు పాడి - ఘనుడు యేసుని జన్మచాటిరి దూతలు కూడి (2)

1.ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును -
అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును (2)
నిత్యము మనకతడు తోడుగా నుండును - అనెడి 
ప్రవక్తల పలుకులు నెరవేరెనిలయనుచు (2) ||గగన||

2.ఏలయనగా మనకొరకు ఒక శిశువు జనియించును - 
రాజ్యభారము అతని భుజముల మీదనే యుండును (2) 
నీతితో న్యాయముతో అతడు పాలించును - అనెడి 
ప్రవక్తల పలుకులు నెరవేరెనిలయనుచు (2) ||గగన||
DOWNLOAD MP3 SONG HERE 👇

Vachindi Vachindi Christmas | వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ

వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ వచ్చింది - 
ఇచ్చింది ఇచ్చింది ఎనలేని ఆనందం ఇచ్చింది (2)

1.మా యింటి ముందున్న క్రిస్మస్ చెట్టు - జ్ఞానుల కానుక గుర్తు తెచ్చింది (2)
గజగజ వణికించే ఈ సాయంకాలం గొల్లల సందడి మాకు పంచింది 

2.గణగణమంటు మోగే గంట - యేసయ్య పూజకు మమ్ము పిలిచింది (2)
ఆకాశంలో వెలిగే ఓ తార - పరిశుద్ధ రాత్రిని మదిలో నిలిపింది(2)
DOWNLOAD MP3 SONG HERE 👇

Mahonathudaina Devudu Mahimarupudu | మహోన్నతుడైన దేవుడు మహిమరూపుడు

మహోన్నతుడైన దేవుడు మహిమరూపుడు - 
మహిలోని జనులపై తన ప్రేమ చూపెను (2) ప్రియకుమారుడు యేసయ్యను - 
ఈలోకమునకు పంపెను(2) 
మానవాళి జీవితాలలో వెలుగు నింపెను (2)
మహోన్నతుడైన దేవుడు మహిమరూపుడు

1.ఆదియందే ఉన్న వాక్యం - దేవునియొద్ద ఉన్నవాక్యం - దేవుడై యున్నట్టి వాక్యం - ప్రేమయై యున్నట్టి వాక్యం (2)
మనుష్య రూపమును - కృపా సత్యమును (2)
ధరించుకొని నరుల మధ్యను నివసించను జనియించెను (2)
మహోన్నతుడైన దేవుడు మహిమరూపుడు - 
మహిలోని జనులపై తన ప్రేమ చూపెను

2. బంధకములలో ఉన్నవారికి విడుదలను ప్రకటించుటకును- భారభరిత ఆత్మకు ప్రతిగా - 
స్తుతి వస్త్రమును ధరింపజేయను (2)
సువర్తమానమును - దీనులకందించను (2)
దేవుని అభిషేకమును పొందెను - 
దైవాత్మతో ఉదయించెను (2) ||మహోన్న||
DOWNLOAD MP3 SONG HERE 👇

Paravashinchi Paadana Parama Shisuvu | పరవశించి పాడనా పరమ శిశువు

పరవశించి పాడనా - పరమ శిశువు జన్మను - 
శిరము వంచి వేడనా - సిరుల బాలయేసును - హాలేలూయా హాలేలూయా (2) 

1.కరములు జోడించి - విరిగిన హృదయముతో - వరసుతునికి పూజచేయనా (2)
పరలోకము వీడిన - ఆ వరదుని ప్రేమను (2)
మరువకనే తలపోయనా (2) ||పరవశించి||

2.ధరణీ తలముపై - నరుడై జన్మించిన - 
పరమాత్ముని మదిని నిల్పనా (2)
కరుణలు కురిపించు- ఆ కారణజన్ముని (2)
నిరతము ఇలనే చాటనా (2) ||పరవశించి||
DOWNLOAD MP3 SONG HERE 👇

Paapulamaina Mammunu Brova | పాపులమైన మమ్మును బ్రోవ

పాపులమైన మమ్మును బ్రోవ - 
పరమునుండి దిగివచ్చిన యేసూ (2) 
పరిమళించెనీ రాకతో ఈ భువి (2) 
పరమపితా వందనమిదిగో (2)

1.సర్వసృష్టిని తిలకించగను - 
సూర్యచంద్రులను పరికించగను (2)
నరుడనైన నా యెడల నీవు (2)
కృప చూపుటకు ఎంతటి వాడను (2) 
పాపులమైన మమ్మును బ్రోవ 

2.బీదలను ఆదరించగను - 
గ్రుడ్డివారికి చూపునివ్వగను (2)
మానవ రూపము దాల్చినదేవా(2)
మహికి రక్షణ తెచ్చితివయ్యా (2) 
పాపులమైన మమ్మును బ్రోవ 

3.ధరణిలోని ప్రేమలన్నియును - 
స్వార్థముతోనే నిండియుండును (2)
ఏ మంచిలేని నాకొరకై ఇలకు(2)
దీనుడవై దిగిన నీ ప్రేమ శాశ్వతం (2) ||పాపుల||
DOWNLOAD MP3 SONG HERE 👇

Kreesthu Janmadinam Pudami Punya | క్రీస్తు జన్మదినం పుడమి పుణ్యదినం

క్రీస్తు జన్మదినం - పుడమి పుణ్యదినం 
మరువలేని.. మరపురాని.. మహా పర్వదినం 

అ.ప: wish you happy christmas (4)

1.యేసయ్యగా - పాకలో ఉదయించినాడు -
రారాజుడే - తొట్టిలో పవళించినాడు (2) ||wish you||

2.ఆ యేసుని - దర్శించినా నీమది వికసించును 
ఆ రాజుని - నీహృది పులకించును (2) ||wish you||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...