Showing posts with label 177 యేసు శిష్యులకు నెరుక. Show all posts
Showing posts with label 177 యేసు శిష్యులకు నెరుక. Show all posts

26 February 2022

Yesu sishyulaku neruka | యేసు శిష్యులకు నెరుక

177
యేసు తన శ్రమలనుగూర్చి ప్రవచించుట
రా - ఆనంద భైరవి,  తా - అట 
(ఛాయ: నాకై చీలిన) 

యేసు శిష్యులకు - నెరుక జేసిన - భవిష్యోక్తులు వినరే = కైసరయన - గర ప్రాంతములను - ఘనుఁడు చేరి తన - గతి మతిఁ దలఁచుచు ||యేసు||

1.యెరూషలే మనెడి - పురమునఁ దన కిఁక - కలిగెడు దుఃఖములు = దురితాత్ములు యూ - దులు కడు బాధలు - పరచి తన్ను సిలు - వను చంపుదు రని ||యేసు||

2.నీతి బోధకు ల - నేకులు పెద్దలు - ఖ్యాతిగ నర్చకులు = అతరిఁదన నప - హాస్యము లాడుచుఁ - బోతరించి యుమి - వేతుర టంచును ||యేసు||

3.మనుజ కుమారుఁడు మరణమై - సమా - ధిని వేయంగఁబడున్ = దన రఁగ మూఁడవ - దినమునఁ బునరు - త్థానమొంది ద - ర్శన మిడు మీకని ||యేసు||
   - పురుషోత్తమ చౌదరి

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...