Showing posts with label Prema yesuni prema lyrics. Show all posts
Showing posts with label Prema yesuni prema lyrics. Show all posts

01 August 2020

Prema Yesuni Prema Adi | ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు


ప్రేమ యేసుని ప్రేమ - అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము - ఇది భువియందించలేనిది
ఎన్నడెన్నడు మారనిది - నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది - నా యేసుని నిత్య ప్రేమ 

1. తల్లిదండ్రుల ప్రేమ - నీడ వలే గతియించును
కన్నబిడ్డల ప్రేమ - కలలా కరిగిపోవును ||ఎన్న||

2. భార్యభర్తల మధ్య - వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును త్వరలో - మోడులా మిగిలిపోవును ||ఎన్న||

3. బంధుమిత్రుల యందు - వెలుగుచున్న ప్రేమదీపము
నూనె ఉన్నంత కాలము - వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్న||

4. ధరలోని ప్రేమలన్నియు - స్థిరముకాదు కరిగిపోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమ - కడవరకు ఆదరించును ||ఎన్న||
- by అంశుమతి మేరీ గారు 
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...