Showing posts with label Hrudaya manedu lyrics. Show all posts
Showing posts with label Hrudaya manedu lyrics. Show all posts

15 June 2023

Hrudayamanedu thalupunodha హృదయ మనెడు తలుపు

310
యేసు హృదయద్వారమును తట్టుట 
రా - భైరవి,   తా - ఆది

హృదయ మనెడు తలుపునొద్ద - యేసు నాధుండు = నిలచి సదయుడగుచు దట్టు చుండు - సకల విధములను ||హృదయ||

1.పరుని బోలి నిలుచున్నాడు - పరికించి చూడ = నతడు పరుడుగాడు రక్షకుండు - ప్రాణ స్నేహితుడు ||హృదయ||

2.కరుణాశీలుం డతడు గాన - గాచి యున్నాడు = యేసు - కరుణ నెఱిగి గారవింప - గరము న్యాయంబు ||హృదయ||

3.ఎంతసేపు నిలువబెట్టి - యేడ్పింతు రతని = నాత - డెంతో దయచే బిలుచు చున్నా - డిప్పుడు మిమ్ములను ||హృదయ||

4.అతడు మిత్రు డతడు మిత్రు - డఖిల పాపులకు = మీర లతని పిలుపు వింటి రేని - యతడు - ప్రియుడగును ||హృదయ||

5.జాలిచేత దన హస్తముల - జాపి యున్నాడు = మిమ్ము - నాలింగనము సేయ గోరి - యనిశము కని పెట్టు ||హృదయ||

6.సాటి లేని దయగల వాడు - సర్వేశు సుతుడు = తన - మాట వినెడు వారల నెల్ల - సూటిగ రక్షించు || హృదయ||

7.చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసు నాధు = నతడు - చేర్చు కొనుచు మీకిచ్చును - చిర జీవము గృపను ||హృదయ||

8.అతడు తప్పక కలుగజేయు - నఖిల భాగ్యములు = మీర - లతని హత్తుకొందు రప్పు - డానందముతోడ ||హృదయ||

9.బ్రతుకు శాశ్వతంబు కాదు - పరికించి చూడ = గాన బ్రతికి యుండు కాలముననే - ప్రభుని గొలువండి ||హృదయ||
                                  - పులిపాక జగన్నాదము

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...