562
జిగట మన్నైన నావంక -
చల్లగ చూడుమయ్యా (2) ||కుమ్మ||
1.పనికి రాని పాత్రనని పారవేయకుమా - పొంగిపొరలు పాత్రగా నన్ను నింపుమా (2)
సువార్తలోని పాత్రలన్నీ - శ్రీయేసున్ పొగడుచుండ
సాక్షిగ నుండు పాత్రగజేసి -
సత్యముతో నింపుము తండ్రి (2) ||కుమ్మ||
2.విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగ జేసి
ఆటంకముల నుండి నను తప్పించి - ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రన్ నేను -
సరిజేసి వాడుమయ్యా (2) ||కుమ్మరి||
3. లోకాశతో నిండి ఉప్పొంగుచు - మార్గంబునేదప్పితిన్
మనుషేచ్ఛలన్నియు - స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిని
పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నిన్ను పట్టితి
ప్రాణంబు నాలో నున్నప్పుడే -
నీ పాదంబుల్ నే పట్టితిన్ (2) ||కుమ్మరి||
- Late Rev. C.A.J. Prasad Rao (AELC)
DOWNLOAD MP3 SONG HERE 👇