Showing posts with label రావూరి లక్ష్మయ్య. Show all posts
Showing posts with label రావూరి లక్ష్మయ్య. Show all posts

04 April 2023

Vachunu kreesthu vachunu | వచ్చును క్రీస్తు వచ్చును

233
క్రీస్తుని రెండవ రాకడ
రా - పంతురావలి, తా - చాపు
(చాయ: వందనం నీకే)

వచ్చును క్రీస్తు వచ్చును - భూలోకమునకు - వచ్చును - క్రీస్తు వచ్చును = చెచ్చెరను మేఘములపె రవ - మిచ్చు బూర సునాదములతో - హెచ్చుగను దూతస మూహము - లచ్చుగను సేవింపగ్రక్కున ||వచ్చును||
 
1.అంతటను సకల భూజనులు - వింతగను బూర ధ్వనియు విని - నంతలోనె సజీవులై ప్రభు - చెంత నిల్తు రపార మహిమను ||వచ్చును||
 
2.ఒనరగనుఁదన మేఘ సింహా - సనముపైఁ గూర్చుండి పావన - జనుల బారుల నిరుపార్శ్వము - లను విభజనముఁ జేయు నిక్కము ||వచ్చును||
 
3.అదను నిది యని హృదయములు ప్రభు - పదయుగళ - సున్నతియెఱుంగక మద దు రేచ్ఛల గెదరు పాపుల - హృదయములు చెదరి భీతిల్లఁగ ||వచ్చును||
 
4.అమిత పాపాత్ముల నరకలో - కమునఁ బడవైచి సుజన సమూ - హముల దనవెను వెంటఁ గొని చను - విమల నిత్య కిరీటము లొసఁగఁ ||వచ్చును||
 
5.తల్లి పిల్లల నెడబాసియు - నల్లకల్లోలముగ భువిపై - తల్లడిల్లుచు నొకరి నొక్కరు - నెల్లకాలము జూడని గడియ ||వచ్చును||
- రావూరి లక్ష్మయ్య

29 August 2022

Vachunu kreesthu vachunu| వచ్చును క్రీస్తు వచ్చును

233
క్రీస్తుని రెండవ రాకడ 
రా - పంతువరాళ్లి, తా - చాపు 
(చాయ: వందనం నీకె)

వచ్చును క్రీస్తు వచ్చును - భూలోకమునకు - వచ్చును - క్రీస్తు వచ్చును = చెచ్చెరను మేఘములపె రవ - మిచ్చు బూర సునాదములతో - హెచ్చుగను దూతస మూహము - లచ్చుగను సేవింపగ్రక్కున ||వచ్చును||

1.అంతటను సకల భూజనులు - వింతగను బూర ధ్వనియు విని - నంతలోనె సజీవులై ప్రభు - చెంత నిల్తు రపార మహిమను ||వచ్చును||

2.ఒనరగనుఁదన మేఘ సింహా - సనముపైఁ గూర్చుండి పావన - జనుల బారుల నిరుపార్శ్వము - లను విభజనముఁ జేయు నిక్కము ||వచ్చును||

3.అదను నిది యని హృదయములు ప్రభు - పదయుగళ సున్నతియెఱుంగక - మద దు రేచ్ఛల గెదరు పాపుల - హృదయములు చెదరి భీతిల్లఁగ ||వచ్చును||

4.అమిత పాపాత్ముల నరకలో - కమునఁ బడవైచి సుజన సమూ - హముల దనవెను వెంటఁ గొని చను - విమల నిత్య కిరీటము లొసఁగఁ ||వచ్చును||

5.తల్లి పిల్లల నెడబాసియు - నల్లకల్లోలముగ భువిపై -  తల్లడిల్లుచు నొకరి నొక్కరు - నెల్లకాలము జూడని గడియ ||వచ్చును||
– రావూరి లక్ష్మయ్య 

09 June 2022

Annaa mana yesu prabhuni | అన్నా మన యేసు ప్రభుని

162
యేసే రక్షకుఁడు
రా - శంకరాభరణం,  తా - రూపకము

   అన్నా మన యేసు ప్రభుని - కన్న రక్షకుఁడు లేఁడు = ఎన్న రాని మన యఘము - లన్ని సడలించి ప్రోచు ||నన్న||

1.మన దోషములకు బదులుగ - మరణావస్థల నొందెను = తన దివ్యావయముల ర - క్తము చిందించెను భువిపై ||నన్న||

2.నిజ రక్షకుఁడితఁడే మన వృజినాదులఁ బరిమార్పను = విజయం బగు నతని పాద - రజయుగ్మును స్మరించు ||మన్న||

3.దిక్కు మాలిన వారికి - దిక్కై మార్గముఁజూపెను = చక్కనీ గుణముల సొం - పెక్కి వర్తించె నహహ ||యన్న||

4.ఈలాటి దయాసముద్రు - నిల నెందైనను గానము = నీలోఁ గల దుర్గుణాది - జాలంబులఁ గడఁ ద్రోయును ||అన్న||

5.మృతి గెల్చిన వాఁడే దు - రిత జీవులఁ బ్రోవఁ దగును = మృతి నొంది నశించు లోక - మూఢాత్ముల కేలఁ గల్గు ||నన్న||
                              – రావూరి లక్ష్మయ్య

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...