యేసుని పోలి నడిచే సాక్షులం
యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం
లోకములో యేసుని ప్రతినిధులం
శోధనలెదురైనా అవరోధములెన్నున్న
విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు
ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా
లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా ||యేసు||
1.నిందారహితులుగాయేసు కోసమే జీవిద్దాం జీవించుట మన పిలుపు
నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు
యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము
లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే
ప్రేమయు సహనము యేసుని హృదయము
కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము ||యేసు||
2. యేసు స్వభామును ధరించిన వారలము
మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము
సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను
రోశముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము
రాజులు జనములు యేసుని చూచెదరు
విశ్వాసులు విశ్వాసములో స్థిరముగా ఉన్నపుడు ||యేసు||