Showing posts with label Bro Hanook songs. Show all posts
Showing posts with label Bro Hanook songs. Show all posts

06 November 2021

Aascharyakarudu Aalochanakartha | ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త - నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2)
తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో
తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2) ||ఆశ్చర్య||

1.తన చేతిలో రోగాలు లయమైపోయెను
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను(2)
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు(2)
నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2) ||ఆశ్చర్య||

2.మనకోసం తనప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
మనకోసం సజీవుడై లేచినవాడతడు (2)
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2)
తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2) ||ఆశ్చర్య||
                                     - సిరివెళ్ల హనోక్
DOWNLOAD MP3 SONG HERE 👇

16 August 2020

Ontarivi Kaavu Yenadu Neevu | ఒంటరివి కావు ఏనాడు నీవు

ఒంటరివి కావు ఏనాడు నీవు - నీ తోడు యేసు ఉన్నాడు చూడు (2)
ఆలకించవా. ఆలోచించావా. ఆనందించవా.(2)
 ||ఒంటరివి||

1. వెలివేసారని చింతపడకుమా - ఎవరూ లేరని కృంగిపోకుమా
ఒంటరితనమున మదనపడకుమా - మంచి దేవుడు తోడుండగా (2)
ఆత్మహత్యలు వలదు - ఆత్మ ఆహుతి వలదు (2) ||ఆలకించవా||

2. బలము లేదని భంగపడకుమా - బలహీనుడనని బాధపడకుమా
ఓటమి చూచి వ్యసనపడకుమా - బలమైన దేవుడు తోడుండగా (2)
నిరాశ నిస్పృహ వద్దు - సాగిపోవుటే ముద్దు(2) ||ఆలకించవా||
---------------------------------------------
Ontarivi kavu yenadu neevu - neethodu yesu unnadu choodu(2)
Aalakinchava.. aalochinchava..aanandinchava (2) ||Ontarivi||
1. Velivesarani chintha padakuma - evaru lerani krungi pokuma
Ontarithanamuna madana padakuma - manchi Devudu thodundaga (2)
Aathmahathyalu baladu - athma ahuthi valadu(2) ||Ontarivi||

2. Balamu ledani banga padakuma - balaheenudanani badha padakuma - Otami choochi vyasana padakuma - balamaina devudu thodundaga (2)
Niraasha nispruha vaddu - sagipovute muddu (2) ||Ontarivi||

DOWNLOAD MP3 SONG HERE 👇

Naadantu lokana | నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా

నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా

నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా(2)
నీదే నీదే బ్రతుకంతా నీదే (2) ||నాదంటూ||

1.నాకు ఉన్న సామర్ధ్యం - నాకు ఉన్న సౌకర్యం
నాకు ఉన్న సౌభాగ్యం - నాకు ఉన్న సంతానం (2)
ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం (2)
కేవలం నీదేనయ్య (2)  ||నాదంటూ||

2.నాకు ఉన్న ఈ బలం - నాకు ఉన్న ఈ పొలం
త్రాగుచున్న ఈ జలం - నిలువ నీడ ఈ గృహం (2)
నిలచియున్న ఈస్థలం - బ్రతుకుచున్న ప్రతిక్షణం (2)
కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ||
   - బ్రదర్. హనోక్ 
______________________________
Nadantuu Lokaana Edi Ledayya Okavela Undante Neevichchanade Prabhuvaa (2)
 Neede Neede Brathukanthaa Neede (2) ||Naadantuu||

1.Naku Unna Saamardhyam Naku Unna Soukaryam Naku Unna Soubhaagyam Naaku Unna Santhaanam (2)
Aaraginche Aahaaram Anubhavinche Aarogyam (2) Kevalam Needenayya (2) ||Naadantuu||

2.Naku Unna Ee Balam Naku Unna Ee Polam Thraaguchunna Ee Jalam Niluva Needa Ee Gruham (2)
 Nilachiyunna Ee Sthalam Brathukuchunna Prathii Kshanam (2) Kevalam Needenayya (2) ||Naadantuu||
     - Bro Hanook
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...