Showing posts with label కొండలవైపు కన్నులెత్తినా ఏ సహాయము. Show all posts
Showing posts with label కొండలవైపు కన్నులెత్తినా ఏ సహాయము. Show all posts

05 July 2021

Kondalavaipu Kannulethina | కొండలవైపు కన్నులెత్తినా ఏ సహాయము


కొండలవైపు కన్నులెత్తినా -ఏ సహాయము దొరకలేదయా
బందువువైపు చేయి చాపినా - అక్కరలేమియు తీరలేదయా
నీ వల్లే సహాయము దొరుకునని - నీ పాద సన్నిధి చేరితిని ||కొండల||

1. అక్కరతో వచ్చిన వారిని - అక్కున చేర్చే గొప్ప దేవుడా (2)
మారాలాంటి స్థితిగతులన్నీ - మధురముగా మార్చిన దేవుడా (2) ||నీ వల్లే||

2. నీవే మాకు దిక్కని ఎంచి - నీ పాదముల శరణు వేడగా (2)
కష్ట బాధలు కన్నీరంతా - తుడచి వేసిన గొప్ప దేవుడా (2) ||నీ వల్లే||

3. గాడాంధకారపు లోయలలోనా - అగాధ స్థలములో మొరపెట్టగా(2)
మా కార్యములను సఫలపరచిన -విజయశీలుడా మంచి దేవుడా(2) ||నీ వల్లే||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...