ఎట్టి వాడో యేసు - ఎన్ని వింతలు తనవి
వట్టి నరుడు కాడు - పట్టి చూడ ప్రభుని (2) ||ఎట్టి||
గాలి సంద్రాలను - గద్దింపగా యేసు (2)
హద్దు మీరక ఆగి - సద్దుమణిగిపోయే (2) ||ఎట్టి||
పక్షవాతపు రోగిని - తక్షణమే లెమ్మనగా (2)
పరుపెత్తుకొని లేచి - పరుగెత్తికొనిపోయె (2) ||ఎట్టి ||
పట్టు యేసుని పాదం - తట్టు దేవుని ద్వారం (2)
కట్టు ఇక నీ పాపం - నెట్టు నిను పరలోకం (2) ||ఎట్టి||
– గోడి సామ్యూల్
No comments:
Post a Comment