Showing posts with label E.G.Aanandamu. Show all posts
Showing posts with label E.G.Aanandamu. Show all posts

20 August 2021

Namo yesunadha nadha | నమో యేసునాధా నాధా

88
యేసును స్తుతించుట
రా – కానడ, తా – ఆది
              
నమో యేసునాధా నాధా – నమో జీవనాధా = సమాన విరహిత సనాతనాత్మా – సమున్నతోజ్వల ప్రశాంత ధామా || నమో ||

1.స్థావర జంగమ జగమందున నీ శక్తి స్వరూపము ప్రతిఫలింపగ = భూ వలయాకాశంబుల మించుచు - భువన పాలనము జేసెటి ప్రభువా||నమో||

2.ధరణీ మానవ విమోచనార్థము – కరుణను జీవము లొసగిన ప్రభువా = పరమ కృపాభరితా మృతసారా వరసజ్జన హృదయాబ్జ విహారా || నమో ||

3.సుందర మలయజ గంధ ధూపముల - చందము నను మా వినుతులు గొను మా = వందే దేవ దయాసందీప = వందే శుభదానంద స్వరూపా||నమో||
  - ఇ.జి. ఆనందము

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...