Showing posts with label Raja Babu Songs. Show all posts
Showing posts with label Raja Babu Songs. Show all posts

12 July 2021

Sthuthine Paadeda Yesayya | స్తుతినే పాడెద యేసయ్యా దుర్గమా శైలమా

స్తుతినే పాడెద యేసయ్యా - దుర్గమా శైలమా శృంగమా నా సర్వమా 

1. నా రాగానికి జీవము నీవే - నా గానానికి ప్రాణము నీవే 
నా ధ్యానానికి రూపము నీవే - యేసయ్యా యేసయ్యా 

2. నా గమనానికి ద్వారము నీవే - నా పయనానికి తీరము నీవే 
నా మార్గానికి దీపము నీవే - యేసయ్యా యేసయ్యా 

3. నా కీర్తనకు కర్తవు నీవే - నా ప్రార్థనకు అర్థము నీవే
నా స్తోత్రానికి పాత్రుడ నీవే - యేసయ్యా యేసయ్యా

03 February 2021

Ninne Ninne Ne Koluthunayya | నిన్నే నిన్నే నే కొలుతునయ్యా

నిన్నే నిన్నే నే కొలుతునయ్యా -  నీవే నీవే నా రాజువయ్యా 
యేసయ్యా.. యేసయ్యా ..యేసయ్యా 

1.కొండలలో లోయలలో - అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా - నన్ను నడిపించినావా (2) 
యేసయ్యా యేసయ్యా..యేసయ్యా యేసయ్యా ||నిన్నే నిన్నే||

2.ఆత్మీయులే నన్ను అవమానించగా - అన్యులే నన్ను అపహాసించగా (2)
అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా.... యేసయ్యా యేసయ్యా ||నిన్నే నిన్నే||

3.మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ - నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
నన్ను బలపరచెనయ్యా - నిన్నే ఘనపరతునయ్య (2)
యేసయ్యా యేసయ్యా... యేసయ్యా యేసయ్యా ||నిన్నే నిన్నే||

4.వంచెన వంతెన ఒరిగిన భారాన - పొసగక విసిగిన విసిరే కెరటాన (2)
కలలా కడతేర్చినావా - నీ వలలో నను మోసినావా (2)
యేసయ్యా యేసయ్యా.... యేసయ్యా యేసయ్యా ||నిన్నే నిన్నే||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...