Showing posts with label 190 ఆహా యెంతటి శ్రమలఁ బొందితి. Show all posts
Showing posts with label 190 ఆహా యెంతటి శ్రమలఁ బొందితి. Show all posts

02 March 2022

Aaha yenthati shramala bondithi | ఆహా యెంతటి శ్రమలఁ బొందితి

190
క్రీస్తు మరణము
రా- హిందుస్థానీ తోడితా - త్రిపుట 

ఆహా యెంతటి శ్రమలఁ బొందితి - వయ్యో - దాహ మాయెను నీకు సిల్వపై = ద్రోహు లందరు గూడి రయ్యయ్యో - నీదు - దేహంబు బాధించి రయ్యయ్యో ||యాహా||

1.దుష్కర్ములకు నప్పగించెనా -  యూద - యిస్కరి యోతనెడి శిష్యుడు - తస్కరించినవాని భంగిన నిన్ను - నిష్కారణముగాను బట్టిరా ||ఆహా||

2.కలుషాత్ములందరు గూడిరా - నిన్ను - బలువిధంబుల హింసబెట్టిరా - తలపై ముళ్ల కిరీటముంచి యా - సిలువ నీతోనే మోయించిరా ||ఆహా||

3.కాలుసేతులయందు వారలు - ఇనుప - చీలల దిగగొట్టిరయ్యయ్యో = జాలి - సుమంతైన జూపక - వారు - గేలిజేయుచు బాధపెట్టిరా ||ఆహా||

4.బాధ తగ్గింపరాణువవారలు - నీకు చేదు ద్రాక్షారసము నివ్వగా = నీదు మనస్సు దానినొల్లక గొప్ప - వేదనలను భరియించెనే ||ఆహా||
 – కొత్తపల్లి జాన్

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...