Showing posts with label Purushotham Choudhary. Show all posts
Showing posts with label Purushotham Choudhary. Show all posts

19 August 2021

Mangalambani Paadare Kreesthuku | మంగళంబని పాడరే క్రీస్తుకు

75
క్రీస్తుకు మంగళ స్తోత్రము
రా - మారువ,  తా - అట
(చాయ : సందియము వీడవే)
                 
మంగళంబని పాడరే - క్రీస్తుకు జయ - మంగళంబని పాడరే - యేసుకు జయ - మంగళంబని పాడరే = మంగళంబని పాడి ¹సజ్జ - నాంగ పూజితుఁడై ²కృపాత - రంగిలోక సమూహ పాపవి - ³భంగుడని యుప్పొంగి జయజయ || మంగళం||

1. ఘన యూద దేశంబులో - బెల్లె హే - మున యూదా గోత్రంబులో = వినుఁ డు యేసేపునకు సతియై - తనరుచుండెడి మరియ కడుపున - జననమై యీ మర్త్య వరులకు - సద్గతిని గల్గించు వానికి || మంగళ ||

2. సోదరాళి భంగిని - భక్తుల నెల్లం - జూచి ప్రోచెడు వానిని = యూద దేశపు వారలధిక - బాధఁ బెట్టుచు హింసఁజేసిన - సాదరంబున ⁴త్రిదినములకు ముదముతో గనుపడిన ప్రభునకు || మంగళ ||

3. ధరణి నొల్చెడి దాసజ - నములను బ్రోచు - దైవ తనయుఁడని నిజ = ⁵మరయ నిలను స్మరించువారికి - గురుతరంబగు ⁶కలుష జలనిధి - దరికి జేర్చు పరమ పదమే - ⁷యిరు వొనర్చెద ననిన ప్రభునకు || మంగళ ||
– పురుషోత్తము చౌదరి
___________________________________
¹సజ్జన సమూహముచేత పూజింపబడిన వాడై . ²అలలవంటి కృపగలవాడు. ³నాశనము చేయువాడు.⁴మూడు రోజులకు. ⁵విచారింపగా ⁶పాప సముద్రము ⁷నివాసము.

16 August 2021

Thellavaarina vella delivondi | తెల్లవారిన వేళ దెలి వొంది

42
ప్రాతస్తవము
రా – కాంభోజి, తా – కురుఝంప
                   
తెల్లవారిన వేళ - దెలి వొంది మన క్రీస్తు - దివ్య నామముఁ బాడరె - యో ప్రియులార - దివస రక్షణ వేఁడరే = తల్లి రొమ్మున దాఁచు - పిల్ల రీతిని మనలఁ జల్లదనముగ రాతి - రెల్లం గాచిన విభునిఁ || దెల్లవారిన వేళ ||

1.నిద్రపోయిన వేళ - నిఖిలాపదులఁబాపి - నిశ లన్ని గడుపు విభునిన్ = భద్రముగ వినతించి - భయభక్తితో మనము - ముద్రి తాక్షులఁ గేలు - మోడ్చి మ్రొక్కుచును ||దెల్లవారిన||

2.భానుఁ డుదయం బయ్యెఁ - బద్మములు వికసిల్లె - గానమలు జేసెం బక్షుల్ = మానసాబ్జము లలర - మనము కల్వరి మెట్ట - పై నెక్కు నినుఁ డనెడి - ప్రభుఁ జూచి వేడ్కన్ IIదెల్లవారినవేళ ||

3.దిట్టముగ మానసేం - ద్రియ కాయ శోధనలు - పట్టుకొని, యుండు దినమున్ దట్టముగ మన నాల్గు - తట్ల యేసుని కరుణఁ జుట్టుకొని రక్షించు - శుభ మడుగుకొనుచున్ ||దెల్లవారిన వేళ||

4.పాప భారము మనము - ప్రభుని పై నిడి గురుని - పాదముల చెంత నొరగి - కాపు కర్త విశాల - కరము మాటున డాఁగి - యాపదలఁ దొలఁ గించు - మని వేఁడుకొనుచున్ ||దెల్లవారిన వేళ||
                               – పురుషోత్తము చౌదరి

01 June 2020

Yehova naa mora | యెహోవ నా మొఱ

16
యెహోవా ప్రేమ 
(23 వ దావీదు కీర్తన) 
రా - శంకరాభరణము,  తా - ఆది
యెహోవా నా మొఱ లాలించెను - దన - మహా దయను నను ¹గణించెను = ²అహర్నిశల దీనహీనుఁడగు నా - దు ³హాయనెడు ధ్వని - గ్రహించి ⁴మనిపెను || యెహోవా||

1.⁵పిశాచి గడిమిఁబడఁగొట్టెను - దన - వశాన నను నిలువఁ బెట్టెను = ⁶ప్రశాంత మధుర సు - విశేష ⁷వాక్ఫల - ⁸నిశాంతమునఁ జే - ర్చి ⁹సేదఁ దీర్చెను || యెహోవా||

2.¹⁰మదావళముఁ బోలు నామదిన్ - దన - ¹¹ప్రదీప్త వా ¹²క్యాం కూశా హతిన్ = యధేచ్చలన్నిటి గురించి పాపపు - మొదల్ తుదల్ నరి - కి దరికిఁ జేర్చెను || యెహోవా||

3.అనీతి వస్త్ర ¹³మెడలించెను - యే - సునాధు రక్తమున ముంచెను ¹⁴వినూత్న యత్నమె - ద నూని యెన్నఁడు - గనన్ వినన్ బ్రే - మ నాకుఁ జూపెను || యెహోవా||

4.విలాపములకుఁ జెవి నిచ్చెను - శ్రమ - కలాపములకు సెలవిచ్చెను శిలానగము పై - కిలాగి నను సుఖ - కళావళుల్ మన - సులోన నిలిపెను || యెహోవా||

5.అగణ్య పాపియని త్రోయక - న - న్ను గూర్చి తన సుతుని దాఁ చక = తెగించి మృతి కొ - ప్పగించి పాపపు - నెగుల్ దిగుల్ సొగ - సుగా నణంచెను ||యెహోవా||
- పురుషోత్తము చౌదరి
_____________________________
¹సంపాదించెను.²రాత్రియందు పగటియందు. ³దుఃఖము చేతగలిగిన. ⁴రక్షించెను. ⁵శక్తి. ⁶మిగుల నెమదిగల. ⁷వాక్కు యొక్క ఫలమైన. ⁸గృహమున ⁹అలత. ¹⁰మదించినయేనుగు.¹¹ప్రకాశమైన.¹² అంకుళపు దెబ్బ చేత. ¹³పోగొట్టెను. ¹⁴క్రొత్త.
------------------------------------------
Yehova na mora laalinchenu - Dana - maha dayanu Nanu ganinchenu = Aharnishala deena hinudagu na - du hayanedu - dhvani grahinchi manipenu ||Yehova||

1.Pishaachi gadimi badagottenu Dana - vashana nanu niluva bettenu = Prashantha madura su - vishesa vakphala Nishanthamuna je - rchi seda deerchenu ||Yehova||

2.Madavalamu bolu naamadin - Dana - pradeeptha vaakyam kusha hathin = Yedhechalanniti gurinchi papapu - Modhal tudhal nari - ki dariki jerchenu ||Yehova||

3.Aneethi vastra medalinchenu - Ye - sunaadhu rakthamuna munchenu = Vinuthna yethna me - da nooni yennadu - Ganan vinan bre - ma naaku jupenu ||Yehova||

4.Vilaapamulaku jevi nichenu - Shrama - kalaapamulaku selavichenu = Silanagamu paiki laagi nanu sukha - Kalaavalul mana - sulona nilipenu ||Yehova||

5.Aghanya paapiyani throyaka - Na - nnu goorchi thana suthuni da chaka = Theginchi mruthi ko - ppaginchi paapapu - Negul digul soga - suga nananchen ||Yehova||
    - Purushothamu choudari
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...