Showing posts with label కల్వరి గిరిపై సిలువ భారం. Show all posts
Showing posts with label కల్వరి గిరిపై సిలువ భారం. Show all posts

23 March 2022

Kalvari giripai siluva bharam | కల్వరి గిరిపై సిలువ భారం

కల్వరి గిరిపై సిలువ భారం -
భరించితివా ఓ నా ప్రభువా
నా పాపముకై నీ రక్తమును
సిలువ పైన అర్పించితివా (2)

దుష్టుండనై బల్లెము బూని -
గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2)
కేక వేసి నీదు ప్రాణం
సిలువ పైన అర్పించితివా (2) ||కల్వరి||

మూడు దినములు సమాధిలో -
ముదము తోడ నిద్రించితివా (2)
నా రక్షణకి సజీవముతో
సమాధిన్ గెల్చి లేచిన తండ్రి (2) ||కల్వరి||

ఆరోహణమై వాగ్ధానాత్మన్ -
సంఘము పైకి పంపించితివా (2)
నీ రాకడకై నిరీక్షణతో
నిందలనెల్ల భరించెదను (2) ||కల్వరి||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...