Showing posts with label Sarva krupanidhi yagu prabhuva. Show all posts
Showing posts with label Sarva krupanidhi yagu prabhuva. Show all posts

23 August 2020

Sarva krupanidhi yagu prabhuva సర్వ కృపానిధియగు ప్రభువా

689
1.సర్వ కృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా (2)
స్తోత్రము చేసి స్తుతించెదను - సంతసమున నిన్ను పొగడెదను (2)

పల్లవి: హల్లెలూయ - హల్లెలూయ (2) 
హల్లెలూయాయని పాడెదను - ఆనందముతో సాగెదను (2)

2.ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నన్ను రక్షించితివి (2)
పరిశుద్ధముగ జీవించుటకై - పాపిని నన్ను కరుణించితివి (2) ||హల్లె||

3.అల్పకాల శ్రమలనుభవింప - అనుదినము కృప నిచ్చితివి (2)
నాధుని అడుగు జాడలలో - నడచుటకై నన్ను పిలిచితివి (2) ||హల్లె||

4.మరణ శరీరము మార్పునొంది - మహిమ శరీరము పొందుటకై (2)
మహిమాత్మతో నన్ను నింపితివి - మరణభయములను తీర్చితివి ||హల్లె||

4.ఎవరూ పాడని గీతమును - యేసుతో నేను పాడుటకై (2)
హేతువు లేకయే ప్రేమించెన్ - యేసుకు నేనే మివ్వగలన్ (2) ||హల్లె||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...