Showing posts with label 030 మా యేసు క్రీస్తు నీవే మహిమ. Show all posts
Showing posts with label 030 మా యేసు క్రీస్తు నీవే మహిమ. Show all posts

14 August 2021

Maa Yesu Kreesthu Neeve Mahimagala | మా యేసు క్రీస్తు నీవే మహిమగల

30 
ఓ దేవా, నిన్ను స్తుతించుచున్నాము
రా – మిశ్రమ, తా - ఆది

మా యేసు క్రీస్తు నీవే - మహిమగల రాజవు నీవు నీవే తండ్రికి నిత్యకుమారుడవు - ఓ క్రీస్తూ ॥

1.భూనరులన్ రక్షింపం బూనుకొనినప్పుడు దీన కన్యాగర్భము దిరస్కరింపలేదుగా - ఓ క్రీస్తూ॥

2*విజయము మరణపు - వేదనపై నొందఁగా = విశ్వాసులందరికిన్ - విప్పితివి మోక్షమున్ - ఓ క్రీస్తూ ||

3.నీవు తండ్రిదైనట్టి - నిత్య మహిమయందు = దేవుని కుడివైపుఁ - దిరముగాఁ గూర్చున్నావు - ఓ క్రీస్తూ ॥

4.నీవు న్యాయాధిపతివై నిశ్చయముగా వచ్చెదవు = కావున నీ సాయంబు కానిమ్ము నీ దాసులకు - ఓ క్రీస్తూ ॥

5*దివ్యమౌ రక్తంబు చిం - దించి నీవు రక్షించిన = సేవకులకై మేము చేయు మనవి నాలించు - ఓ క్రీస్తూ ॥

6*నీ వారి నెల్లప్పుడును - నిత్య మహిమయందు = నీ పరిశుద్ధులతోను - నీ వెంచుకొను మయ్య - ఓ క్రీస్తూ

7*నీదు జనమున్ రక్షించి నీ దాయము దీవించుము = నాధా వారలను నేలి - లేవనెత్తు - మెప్పుడును - ఓ క్రీస్తూ||

8*దిన దినమును నిన్ను - మహిమ పర్చుచున్నాము = ఘనముగా నీ నా మము - గొప్పచేయుచున్నాము - ఓక్రీస్తూ ||

9*నేఁడు పాపము చేయకుండ నెనరుతో మముఁ గావుమయ్యా = పాడెడి నీ దాసులకుఁ బరమ దయ నిమ్మయ్య - ఓ క్రీస్తూ ||

10*ప్రభువా కరుణించుము - ప్రభువా కరుణించుము = ప్రార్థించు నీ దాసులపై వ్రాలనిమ్ము దీవెనల - ఓ క్రీస్తూ

11.నిన్ను నమ్మి యున్నాము - నీ కృప మా పైఁ జూపుము = మేము మోసపోకుండ - నీవే కాపాడు మయ్యా - ఓ క్రీస్తూ||
               – నమూయేలు పాక్యనాధము
_____________________________________
* ఈ గుర్తుగల చరణములను దీనస్వరముతో పాడదగును.

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...