Showing posts with label Nenu Velle Maargamu Naa Yesuke lyrics. Show all posts
Showing posts with label Nenu Velle Maargamu Naa Yesuke lyrics. Show all posts

30 March 2021

Nenu Velle Maargamu Naa Yesuke | నేను వెళ్ళే మార్గము నా యేసుకే

నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును
శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను(2) 
                                              ||నేను||
1.కడలేని కడలి తీరము -
   ఎడమాయె కడకు నా బ్రతుకున(2)
   గురిలేని తరుణాన వెరువగ - 
   నాదరినే నిలిచేవ నాప్రభు
   హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌(2)

2. జలములలోబడి నే వెళ్లినా- 
    అవి నా మీద పారవు(2)
    అగ్నిలో నేను నడచినా - 
    జ్వాలలు నను కాల్చజాలవు
    హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌(2)

3. విశ్వాస నావ సాగుచు- 
    పయనించు సమయాన నా ప్రభు(2)
    సాతాను సుడిగాలి రేపగా -
    నా యెదుటే నిలిచేవా నా ప్రభు
    హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌(2)

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...