Showing posts with label మధురం మధురం నా ప్రియయేసుని. Show all posts
Showing posts with label మధురం మధురం నా ప్రియయేసుని. Show all posts

16 November 2020

Madhuram Madhuram Naa Priya | మధురం మధురం నా ప్రియయేసుని

మధురం మధురం నా ప్రియయేసుని చరితం మధురం 
శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం(2) 
దీనమనస్సు దయగల మాటలు 
సుందర వదనం తేజోమయుని రాజసం (2) 
                                                ||మధురం||
1. ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి    
    చీకటిలోనున్నవారిని బంధింపబడియున్నవారిని - 
    విడుదల చేయుటకు (2) 
    నిరీక్షణ కలిగించి వర్ధిల్లజేయుటకు 
    యేసే సరిపాటి నా యేసే పరిహారి (2)  
                                                ||మధురం||
2. పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు 
    చింతలన్నియు బాపుటకు 
    ప్రయాసపడువారి భారము తొలగించుటకు (2) 
    ప్రతిఫలమునిచ్చి ప్రగతిలో నడుపుటకు 
    యేసే సరిపాటి నా యేసే పరిహారి (2)
                                               ||మధురం||
3. కలవరపరచె శోధనలెదురైన 
    కృంగదీసే భయములైనను 
    ఆప్యాయతలు కరువైనను - 
    ఆత్మీయులు దూరమైనను2
    జడియకు నీవు మహిమలో నిలుపుటకు 
    యేసే సరిపాటి నా యేసే పరిహారి (2)
                                                ||మధురం||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...