Showing posts with label Oke okka korika manninchu yessayya. Show all posts
Showing posts with label Oke okka korika manninchu yessayya. Show all posts

ఒకే ఒక్క కోరిక మన్నించు యేసయ్య Oke okka korika manninchu yessayya

ఒకే ఒక్క కోరిక మన్నించు యేసయ్య 
అడిగి అడిగి నేను అలసిపోతినయ్యా 
నీ సన్నిధికి వచ్చామయ్యా త్రోసివేయకు 
ఎన్నేండ్ల నుంచో నేను ఎదురుచూచితి (2)
ఈసారి అయినా మాపై జాలి చూపవా 
ఈసారి అయినా మాపై కరుణ చూపవా

1. విరోధుల చేతిలో నలిగిపోతిమి -శ్రమలనే కొలిమిలో కాల్చబడితిని 
భరించుటకు నేను వెండిని కాదయ్యా 
ఓర్చుకొనుటకు నేను మట్టి నేనయ్యా 
ఇక చాలయ్య కొలిమిలో నుండి పైకి లాగవా 
ఇక చాలయ్య శ్రమ అనే కొలిమిలో నుండి పైకి లాగవా

2. కన్నీరు విడుచుచు విత్తుచుండగా 
సంతోష గానముతో పంటకోసేదా 
నీ కొరకై సిద్ధము చేసిన ఫలము కోసమే ఉపవాస ప్రార్థనలో కనిపెట్టేదా 
ఇక చాలయ్య కన్నీటి లోయ నుండి పైకి లాగవా