Showing posts with label O sadbhaktulara lyrics. Show all posts
Showing posts with label O sadbhaktulara lyrics. Show all posts

30 July 2020

O Sadbakthulara Loka | ఓ సద్భక్తులారా

126
O come all ye faithful

1. ఓ సద్భక్తులారా లోక రక్షకుండు - 
    బెల్లెహేమందు నేడు జన్మించెన్ - 
    రాజాధిరాజు ప్రభువైన యేసు - 
    నమస్కరింప రండి - నమస్కరింప రండి - 
    నమస్కరింప రండి - యుత్సాహముతో 

2. సర్వేశ్వరుండు నరరూపమెత్తి  - 
    కన్యకు బుట్టి నేడు వేంచేసెన్ - 
    మానవజన్మ మెత్తిన శ్రీ యేసూ 
    నీకు నమస్కరించి - నీకు నమస్కరించి - 
    నీకు నమస్కరించి - పూజింతుము

3. ఓ దూతలారా  ఉత్సహించి పాడి - 
    రక్షకుండైన యేసుని స్తుతించుడి - 
    పరాత్పరుండా నీకు స్తోత్రమంచు
    నమస్కరింప రండి -  నమస్కరింప రండి - 
    నమస్కరింప రండి - యుత్సాహముతో 

4. యేసూ  ధ్యానించి - నీ పవిత్ర జన్మ - 
    మీ వేళస్తోత్రము నర్పింతుము - 
    ఆనాది వాక్య - మాయె నరరూపు 
    నమస్కరింప రండి - నమస్కరింప రండి - 
    నమస్కరింప రండి - యుత్సాహముతో
   - ఫ్రెడరిక్ ఒకేలీ
   అను: బర్నాడ్ లూకాస్
 DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...