Showing posts with label Naa yesunaadha neeve na. Show all posts
Showing posts with label Naa yesunaadha neeve na. Show all posts

24 October 2022

Naa yesunaadha neeve na | నా యేసునాధ నీవే నా ప్రాణ

నా యేసునాధ నీవే నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్య
నా జీవితాంతము నిన్నే స్తుతింతును
నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును
ఏ రీతి పాడనూ - నీ ప్రేమ గీతము
ఏనాడు వీడనీ - నీ స్నేహ బంధము
నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్య
నా దాగుచోటు నీవే యేసయ్య 

1.ప్రభు యేసు దైవమా - చిరకాల స్నేహమా
నీలో నిరీక్షణే - బలమైనదీ
ప్రియమార నీ స్వరం - వినిపించు ఈ క్షణం
నీ జీవవాక్యమే - వెలుగైనదీ
నీ సన్నిధానమే - సంతోష గానమై
నీ నామ ధ్యానమే - సీయోను మార్గమై భయపడను నేనిక - నీ ప్రేమ సాక్షిగా
గానమై - రాగమై
అనుదినము నిన్నే - ఆరాధింతును
కలకాలం నీలో - ఆనందింతును 

2.కొనియాడి పాడనా - మనసార వేడనా
నీ ప్రేమ మాటలే - విలువైనవీ
ఎనలేని బాటలో - వెనువెంట తోడుగా
నా యందు నీ కృప - ఘనమైనదీ
నా నీతి సూర్యుడా - నీ ప్రేమ శాశ్వతం
నా జీవ యాత్రలో - నీవేగ ఆశ్రయం
నీ పాద సేవయే - నాలోని ఆశగా
ప్రాణమా - జీవమా
అనుదినము నిన్నే - ఆరాధింతును కలకాలం నీలో - ఆనందింతును

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...