Showing posts with label p susheela Christan songs. Show all posts
Showing posts with label p susheela Christan songs. Show all posts

03 May 2021

Saswathama Ee Deham | శాశ్వతమా ఈ దేహం త్వరపడకే

శాశ్వతమా.... ఈ దేహం 
త్వరపడకే.... ఓ మనసా (2)

1. క్షణికమైన ఈ మనుగడలో 
    పరుగులేలనో అనుక్షణం 
    నీటిపై ని చిరు బుడగవోలె 
    ఈ దేహము ఏవేళ చితికిపోవునో 
                                        ||శాశ్వతమా||
2. ఈ లోకములో భోగములెన్నో 
    అనుభవించగా తనివి తీరేనా 
    ఈ తనువే రాలిపోయిన (2)
    నీ గతి ఏమో నీకు తెలియునా 
                                        ||శాశ్వతమా||
3. దేహ వాంఛలను దూరముచేసి 
    ఆ ప్రభుయేసుని శరణముకోరి 
    నీతి మార్గమున నడచుకొందువో
    చిరజీవముతో తరియించేవు
                                        ||శాశ్వతమా||
DOWNLOAD MP3 SONG HERE 👇

08 April 2021

Ammalaara O Priyulaara | అమ్మలారా ఓ ప్రియులారా కన్నీరెందుకు

అమ్మలారా ఓ ప్రియులారా కన్నీరెందుకు నా కోసం 
మీ కోసం మీ పిల్లల కోసం 
కన్నీటి ప్రార్థన కావాలమ్మా
పలికెను యేసు సిలువ మోయుచూ 
జ్ఞాపకం చేసుకో సంఘమా

1. జడలో పువ్వులు కానేకావు -
    దురాశ పువ్వులు తీసేయాలి
    మెడలో మంగళ సూత్రం కాదు 
    దుష్కామ సుత్రాలు తెంపేయాలి 
    చేతుల గాజులు కానే కాదు 
    చెవి గుసగుస గాజులు పగలాలి
    వేశ్య నైనా క్షమిస్తాడు దేవుడు
    వేషధారణ క్షమించడమ్మ  ||అమ్మలారా||

2. గుడిలో కాదు మెడలో కాదు 
    గుండె గుడిలో ధరించాలి సిలువ
    గుండె చప్పుడు ఆగే వరకు
    గుండె బడిలో భరించాలి సిలువ
    సిలువ లేనిది విలువ లేదు 
    విలువ లేనిది బ్రతుకు కాదు
    ఆత్మ దేవుని అగ్ని స్వరం 
    ఆలకించుము ఓ సంఘమా ||అమ్మలారా||
DOWNLOAD MP3 SONG HERE 👇

19 March 2021

Hrudayame Nee Alayam Kreesthu | హృదయమే నీ ఆలయం క్రీస్తు


హృదయమే నీ ఆలయం క్రీస్తు - నీ నామమే నా గానం
విదితము కాదే ఇలలో ఎవరికీ - వివరింపగా నీ పావన రూపం -
హృదయమే నీ ఆలయం క్రీస్తూ...

1. మనిషి మనిషిగా బ్రతకాలని - మంచిని మనసున పెంచాలని
సిలువలో నీవు మరణించి (2) మృత్యువునే నీవు ఎదురించి 
వెలసిన దేవుడా నీవే - పాపుల రక్షణ నీవే ||హృదయమే||

2. కారు చీకటిలో కాంతి రేఖవై - మూగ గుండెల్లో దివ్య వాణివై -
దీనులనే నీవు కరుణించి (2) - వేదనలే నీవు తరలించి
పరమున చేరిన దేవా - శరణు శరణు ఓ ప్రభువా ||హృదయమే||
___________________________
Hrudayame nee alayam kreesthu - Nee namame naa gaanam
vidhithamu kadhe ilalo evariki - Vivarinchaga nee pavana rupam
Hrudayame nee alyam kreesthu ||Hrudaya||

Manishi manishiga brathakalani - Manchini  manasulo penchalani
siluvalo neeve maraninchi (2) - Mruthyuvu ne neevu yedurinchi
Velasina devida neeve - Paapula rakshana neeve ||Hrudaya||

Kaaru cheekatilo kaanthi rekhavai- Muga gundelo dhivya vanivai
Deenulane neevu karuninchi(2) - Vedhanle neevu Tharalinchi
Vanamunu cherina deva - Saranu saranu o prabhuva  ||Hrudaya||

DOWNLOAD MP3 SONG HERE 👇

18 January 2021

Nee Charanamkanna Vere | నీ చరణంకన్న వెరే శరణం లేదు

నీ చరణంకన్న వెరే శరణం లేదు
పరలోకముకన్న వెరే గామాము లేదు(2)
ఓ దేవాది దేవా నా క్రిస్తు దేవా..
                                   ||నీ చరణము||
ఈ చీకటి లోకములో నీ వెలుగును కోరితిని
నీ శాశ్వత రాజ్యములో నేనాశ్రయ మడిగితిని(2)
ఓ దేవాది దేవా నా క్రిస్తు దేవా ..
                                  ||నీ చరణము||
నీ రక్షణ మార్గములో సంరక్షణ కొరితిని
నీ పదముల దరి చేరి నేశాంతిని వేదితిని(2)
ఓ దేవాది దేవా నా క్రిస్తు దేవా..
                                 ||నీ చరణము||
__________________________
Nee charanamukanna vere sharanam ledu
Paralokamukanna vere gamyamu ledu(2)
Oh devaadi deva Naa kristhu devaa..
                           ||Nee charanamu||
Ee chikati lokamulo nee velugunu korithini 
Nee shashwatha rajyamulo nenashreya madigithini(2) 
Oh devaadi deva Naa kristhu devaa..
                          ||Nee charanamu||
Nee rakshana maargamulo samrakshana korithini
Nee padamula dari cheri ne shanthini vedithini (2) 
Oh devaadi deva Naa kristhu devaa..                                              ||Nee charanamu||

DOWNLOAD MP3 SONG HERE 👇

10 January 2021

Bhavana Deevena Neeve | భావన దీవెన నీవే

 
భావన దీవెన నీవే - 
నా సాధన ప్రార్థన నీవే క్రీస్తు (2) 

1. జీవనమౌ నీ ప్రేమ దీపము - 
    పావనమౌ నీత్యాగ రూపము (2)
    పదిలపరచి నాహృదయములో -
    సతతము నిన్నే సేవింతును  ||భావన||

 2. శోభితమౌ నీ సుందర హృదయం - 
    శుభకరమౌ నీ ఆశ్రిత సదనం (2)
    జయకరమౌ నీమార్గంలో - 
    నీదరి నన్నే నడిపించుము  ||భావన||
________________________
Bhavana Deevena Neeve - 
Naa sadhana Prardhana neeve kreesthu (2)

Jeevanamou nee prema deepamu -
Paavanamou nee thyaga rupamu (2)
Padhila parachi naa hrudayamulo -
Sathathamu ninne sevinthunu ||Bhavana||

Shobhithamou nee sundara hrudayam
Shubhakaramou nee aashritha sadanam (2)
Jayakaramou nee maargamulo -
Nee dari nanne nadipinchuma ||Bhavana||
DOWNLOAD MP3 SONG HERE 👇

06 January 2021

Nee naamame udaya | నీ నామమే ఉదయ గానం

నీ నామమే ఉదయగానం - నీ వాక్యమే హృదయధ్యానం
ఓయేసు క్రీస్తు నీస్మరణలోనే - నాబ్రతుకు కడతెరని..
పరలోకమును జేరనీ ||నీనామమే||
 
1.బ్రతుకు బాటలో వెతుకులాటలో - అతుకుల గతుకుల - చితికిన బ్రతుకుల(2)
సాతాను సంకెళ్ళలో - పాపాల స్మృతి జ్వలలో
శోదన రోదన ఆవేదనలో - ఈ బ్రతుకు ఇక మోయాలేను ||నీనామమే||
 
2.కల్వరిగిరిలో శ్రమలు సహించి - సిలువలో నీవే రక్తము చిందించి (2)
సాతనునే సంహరించి - పాపలనే పరిహరించి - 
మోక్ష మార్గము చూపిన దేవా - రక్షణ భాగ్యము నీవే ప్రభువా ||నీనామమే||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...