Showing posts with label Snehamai Pranamai Varinche. Show all posts
Showing posts with label Snehamai Pranamai Varinche. Show all posts

08 February 2021

Snehamai Pranamai Varinche | స్నేహమై ప్రాణమై వరించే దైవమై

స్నేహమై ప్రాణమై వరించే దైవమై 
ఇదే జీవితం నీకే అంకితం ఇదే నా వరం నీవే అమృతం - నిరంతరం సేవించనీ (2)
                                         ||స్నేహమై||
జగతిన వెలసి మనసున నిలచి -
కోరె నన్ను దైవము(2)
లోకమందు జీవమాయె - చీకటందు దీపమాయె పలకరించే నేస్తమాయె - కనికరించే బంధమాయె
ఎంత ప్రేమ యేసయా - నన్ను నీలో జీవించనీ 
                                         ||స్నేహమై||
తలపున కొలువై మనవుల బదులై -
చేరె నన్ను నిరతము (2)
కలతలన్నీ కరిగిపోయే - భారమంతా తొలగిపోయే ఆపదందు క్షేమమాయె - తరిగిపోని భాగ్యమాయే 
ఎంత ప్రేమ యేసయా - నన్ను నీలో తరియించనీ
                                         ||స్నేహమై||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...