నదిలోని అలలుగా నా మది ప్రవహిస్తూ
సముద్రమంటి నిన్ను చేరాలని ||2||
నీలో కలవాలని - నీలో ఇమడాలని ||2||
అ.ప: ఆశయ్య... చిన్ని ఆశయ్య -
యేసు నా ఆశ నీవయ్యా ||2||
1.మేఘం నాపై కమ్మియుండగా - కృంగదీసే శ్రమలు ముంచుకొస్తూ ఉండగా
చీకటి శోధన - ఆశను కాల్చివేస్తుండగా (2)
అర్ధంకాని అవాంతరాలు - నాపై ఆవరించగా (2) ||ఆశయ్య||
2.తీరం నాకు తెలియకుండగా - కారుమబ్బు నాపై కమ్మియుండగా
ఆగని వేదన - గుండెను చీల్చివేస్తుండగా
అర్ధం కానీ అవమానాలు - నాపై ఆవరించగా (2) ||ఆశయ్య||
Lyrics,Tune : Rev AnilKumar
Music : JK Christopher