Showing posts with label ninnu vidichi poledu. Show all posts
Showing posts with label ninnu vidichi poledu. Show all posts

03 February 2021

Ninnu Vidachi Poledu Ninnu Marachi | నిన్ను విడచి పోలేడు నిన్ను మరచి పోలేడు

నిన్ను విడచి పోలేడు నిన్ను మరచి పోలేడు 
నీ కొరకే దిగి వచ్చాడు నీ కోసం మరణించాడు 

తన చేతులతో చేసెను తన ఊపిరిని పోసెను 
తన రూపులో తన పోలికలో నిన్ను నన్ను చేసెను 

గాయములెన్నో నొందెను బహుదెబ్బలు పొందెను నడి వీధిలో నలుగురిలో నలిగి విరిగి పోయెను 
నిన్ను విడచిపోగలడా నిన్ను మరచిపోగలడా 

ప్రాణంగా ప్రేమించెగా తన ప్రాణాన్నే నీకిచ్చెగా 
నీ కోసమే కల్వరిలో రక్తమంతా కార్చెగా 
నిన్ను విడచిపోగలడా నన్ను మరచి పోగలడా 
నా కొరకే దిగివచ్చెగదా నా కోసం మరణించెగదా 
నన్ను విడిచిపోలేడు నన్ను మరిచిపోలేడు

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...