Showing posts with label Naa Daaguchotu Neeve Yesayya. Show all posts
Showing posts with label Naa Daaguchotu Neeve Yesayya. Show all posts

05 March 2021

Naa Daguchotu Neeve Yesayya | నా దాగుచోటు నీవే యేసయ్యా

నా దాగుచోటు నీవే యేసయ్యా 
నా విచారములు కొట్టివేసి - ఆనందము కలుగజేసితివి నాహృదయములో నదివలే సమాధానమే 
నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే

తగిన సమయములో హెచ్చించునట్లు 
నను దాచి కాచితివి 
దీనమనస్సు కలిగి జీవింప నీకృపనిచ్చితివి 
నా చింతలన్ని బాపి నీ శాంతితో నింపితివి 
నా హృదయములో నదివలే సమాధానమే 
నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే 
                                     ||నా దాగు||
ఆపత్కాలములో పర్ణశాలలో నను నీవు దాచితివి 
నా సహాయకుడ నీవని నే నాట్యమాడి కీర్తింతును 
నా జీవితకాలమంతయు నీ సన్నిధిని నివసింతును 
నా హృదయములో నదివలే సమాధానమే నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే
                                      ||నా దాగు||
అగ్నిశోధనలు నను చుట్టుకొనగా దాచితివి నీ కౌగిలిలో స్నేహబంధముతో బంధించి నను ప్రేమించితివి 
జేష్ఠుల సంఘముకైనను సిద్ధపరచితివి 
నా హృదయములో నదివలే సమాధానమే నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే
                                   ||నా దాగు|

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...