Showing posts with label 023 ఎటుల నీకు స్తుతు లొనర్తుము. Show all posts
Showing posts with label 023 ఎటుల నీకు స్తుతు లొనర్తుము. Show all posts

14 August 2021

Etula Neeku Sthuthu Lonarthumu | ఎటుల నీకు స్తుతు లొనర్తుము

23
దేవుని స్తుతి
రా – ముఖారి, తా – చాపు
(చాయ: ఓ మాతండ్రి నీదు నామము)

ఎటుల నీకు స్తుతు లొనర్తుము - యెహోవ తనయ - యెటుల నీకుఁ నుతు లొనర్తుము = పటుతర పాపంబులనెడి -  పంకమందుఁజిక్కి మదిని - దిటముఁ జెడిన మమ్ముఁబ్రోచి - దిక్కుఁజూపినట్టి యేసూ ||యెటుల||

1.పాపకూపమందు నుండగాఁ బాపా విమోచ - దాపుఁజేర్చి కాపు జూపితి = శాపగ్రస్తులైన మా - శాపము విముక్తిఁజేయ - నీ పవిత్ర రక్తమే నా - ప్రాపుగా నొసంగితివి ||యెటుల ||

2.భార భరితమైన యాత్మల - భారమును దీసి - భూరి సౌఖ్యములతో నింపను = భారకుండ - ఘోరమైన శ్రమలనొంది - మరణమొంది తిరిగిలేచి నీవు ధాత్రిి -  మహిమ నొందినట్టి దేవ ||యెటుల||

3.నీతిహీనులమై యుండఁగా - నో కర్త మాదు - భీతులన్నిఁబాపి నీ కృపన్ = నీతి రక్షణవస్త్రములను - భాతిగ ధరింపజేసి - భూతలంబునందు నిన్ను - ఖ్యాతిగ సేవింపఁజేసితి ||యెటుల||

4.నిన్నుఁజేరి నిర్చలుండనై - యీ భూమియందు - నిన్నుఁ బోలి నడుచుకొనుటకై = తిన్నని మార్గమును జూపి - అన్ని కీడులను జయింపఁ - బన్నుఁగ విమలాత్మశక్తి - నున్నతముఁగ నిడిన యేసూ || యెటుల ||

5. పరమ రాజ్యమందు నిరతము - నీతోడనుండ - కరుణతోడ నెంచుకొంటివి = తిరిగి వచ్చి మమ్మును మీ చిరప్రకాశ పురమునందుఁ త్వరగఁ జేర్చియందు సుఖము - దిరముగా నొసంగుదేవ || యెటుల ||
- మాముడూరి సైమన్

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...