Showing posts with label 015 యెహోవా నా కాపరి లేమేమి. Show all posts
Showing posts with label 015 యెహోవా నా కాపరి లేమేమి. Show all posts

10 August 2021

Yehova Naa Kaapari Lememi | యెహోవా నా కాపరి లేమేమి

15
యెహోవా నా కాపరి
రా - శంకరాభరణము, తా - ఏక
(చాయ: ఎంత ప్రేమ) 

యెహోవా నా కాపరి లే - మేమి గలుగదు = తన మేమి గలుగదు = తన - మహా కృపతోఁ బ్రోచి నన్ను - మనుపు నాతఁడే ||  

1.పచ్చికగల చోట్ల నను ప - రుండజేయుచుఁ - గడు - హెచ్చగు సౌఖ్యములు సదా - యిచ్చు నాతఁడే || 

2.శాంతికర జలములకు నను - సాగజేయుచు = వి - శ్రాంతి ప్రాణమున కొసంగు విభుఁడు ఆతఁడే || 

3.గాఢాంధకారమైన లోయల - గుండ బోయిన = నే - కీడుకు భయపడ నింక - తోడు ఆయనే ||  

4.దుడ్డుకట్టతో శత్రువులఁ - దరుమఁ గొట్టుచుఁ = దన - దొడ్డ దండముతో నీతి - దారిలో నడుపు ||  

5.అందరిలో నన్ను నెంచి - యధిక ప్రేమతోఁ = గడు - విందు లొసఁగి తృప్తిపరుచు - విభుఁడు - ఆయనే ||  

6.ముఖము కళగా నుండునట్లు - మంచితైలమున్ = నా - సఖుఁడు నాకుఁ బూయుచుండు - సకల వేళలన్ ||  

7.బ్రదుకు దినము లన్నిట నాకు బంటులవలెనే = నను - వెదకి కృపా క్షేమములు నా వెంటవచ్చును ||
- సరెళ్ల సమూయేలు సుబ్బయ్య

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...