Showing posts with label త్రోవలో నీవుంటివో త్రోవప్రక్క పడి. Show all posts
Showing posts with label త్రోవలో నీవుంటివో త్రోవప్రక్క పడి. Show all posts

28 May 2021

Throvalo Neevuntivo Throvaprakka Padi | త్రోవలో నీవుంటివో త్రోవప్రక్క పడియుంటివో


త్రోవలో నీవుంటివో - త్రోవప్రక్క పడియుంటివో 
త్రోవ చూపిన నజరేయుని కనలేని అంధుడవైయుంటివో 
అ.ప: జీవితపు ఈ యాత్రలో నీ పరిస్థితి తెలుసుకో
 జీవమార్గం క్రీస్తులో నిన్ను నీవు నిలుపుకో 

1. చెరిపివేసుకున్నావు నీదు మార్గమును - 
చెదిరి ఎన్నుకున్నావు స్వంత మార్గమును 
పాపపు అంధకారంతో మార్గం కనరాకయుంటివే -
చీకటి దారిన పయనంతో మరణం కొనితెచ్చుకుంటివే
 
2. సిద్ధపరచెను యేసు నూతన మార్గమును 
బలిగ అర్పణగ చేసి శరీరరక్తమును 
సత్యమైన ఆ మార్గంలో జీవం క్షేమం ఉందిలే
 నిత్యుడు ఆ దేవుని చేరే ధైర్యం కలిగించిందిలే 

3. నడచి వెళ్ళుచున్నావా అరణ్యమార్గమున
 గమ్యమెరుగకున్నావా జీవనగమనమున
 పర్వతములు త్రోవగ చేసి నీటి యొద్దకు చేర్చులే
 త్రోవలను తిన్నగ చేసి ఆత్మదాహమును తీర్చులే

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...