Showing posts with label R. Show all posts
Showing posts with label R. Show all posts

04 June 2026

రండి యేసుని యొద్దకుఁ ప్రియులారా Randi yesuni yoddhaku priyulaara

298
యేసునొద్ధకు రండి
రా - మాధ్యమావతి, తా - ఆది 

రండి యేసుని యొద్దకుఁ - ప్రియులారా మీరు - రండి యేసుని యొద్దకు = రండి రండి - రయమున బిలుచుచు - నుండెడి రక్షకుఁ - డొసఁగెను బ్రాణము ||రండి||

1.మీరు పాపంబులఁ ద్యజించి - యేసుని కడకు - రారే వేగము విశ్వసించి = మీరు వచ్చినను - మిమ్మును ద్రోయఁడు - చేరెడు వారిని - జేర్చును దన దరి ||రండి||

2.మీకు బ్రతుకేమి శాశ్వతము - ప్రియ జనులారా - పోకుఁడి యాశించి లోకమును = లోకాశలకును - లొంగుట చేతను - మీకు ఘటిల్లును - మెండగు దుఃఖము ||రండి||

3.మీరేల జాలము చేసెదరు - ప్రియులారా వేగ - రారే కడు భాగ్య మొందెదరు = చేర వచ్చి చిర - జీవము నొందుఁ డ - పార ముదంబును - బడయఁగ దేవుఁడు ||రండి||

- పులిపాక జగన్నాథము

01 June 2026

రండి రండి సువార్తబోధ విన Randi randi suvaarthabhodha vina

275
క్రీస్తుని నమ్మి బాప్తిస్మము పొంద రండి 
(చాయ: పాపులారా మీ పని సరి)
రా - రేగుప్తి, తా - ఆది 

రండి రండి సువార్తబోధ విన - రారోజనులారా = నిండు మనంబుల కోర్కెలూరగను - నిజరక్షకుఁడగు యేసునిఁ జేర ||రండి||

1.పాపము లెడ బాపను యిలకరిగిన - ప్రభువు మహిమ వినుఁడి - మీ మీ - పాపములను దలపోసి హృదయముల - పశ్చాత్తాపపడి = యా పరమగురుని నామముద్వారా - ననుసరించి ముంచడముఁ బొందు ||రండి||

2.తన మహిమను బలమును - దైవత్వము తగ్గించుకొని వడి - యప్పుడు తన సేవకుఁడని మదిఁదలపోయని - తగు నీతిని గనుఁడీ = క్రీస్తుండును బాప్తి స్తు డు యోహానునిచే మునుకొని యోర్దాన్నదిలో ముంచుటగని ||రండి||

3.మురియుచు క్రీస్తువు యోర్దాన్నదిలో - ముంచబడినరీతి - నిప్పుడు - గరిమెతో క్రీస్తుని నమ్మిన జనములు - గైకొనుటది నీతి = మరువక - స్థిరముగ మీ మనముల నెల్ల -ప్పుడు నరమరవిడి క్రీస్తుని తగఁజేర ||రండి||

4.తల్లులు తమ బిడ్డల - కాశీర్వాదము లిమ్మని తేగా - నప్పుడు - చల్లగ బాలుర  కాశీర్వాద మెసఁగె ప్రభు విదిగాక = క్రీస్తుఁడు - తొల్లి జనములకు ముంచడ మిచ్చిన - టెల్ల విధులలేదు వేదమున ||రండి||

5.అందుచేత వేదమున - బాప్తిస్తుండనఁబడె యోహాను - ఇప్పుడు పొందుగ ముంచువారు బాప్తిస్తులు పొసగగ సరిగాను - మీరలు - నందఱు విన సత్య వేదవాక్యము - సందియములు విడి సాగి వేగమున ||రండి||

30 May 2026

రమ్ము పరిశుద్ధాత్మ దేవుఁడా Rammu Parishudhathma devuda

 249
మార్గదర్శియగు పరిశుద్ధాత్ముండు 
(ఛాయ: ఓ మా తండ్రి నీదు నామము)
రా - ఆనంద భైరవి, తా - ఏక 

రమ్ము పరిశుద్ధాత్మ దేవుఁడా - మమ్మును గృపాస - నమ్ముకడకు - నెమ్మి నడుపుమా = మమ్ము నడుపు దీక్షతోఁబ - రమ్ము విడిచి యాత్మస్వరూ - పమ్మున నరుదెంచిన దై - వమ్ము నీవెకద యెహోవ ||రమ్ము||

1.లోకయాత్ర చేయునప్పుడు చీ - కాకుపడిన - మాకు నీవె మార్గ దర్శివై = వీఁక నొసఁగి - మాకరంబుఁ - జేకొని పరిశ్రమముఁబాపి -  సిలువఁ బడినవానికడకు - త్సేకమూని మమ్ముఁజేర్ప ||రమ్ము||

2.భక్తవన వసంతదైవమా - నీయందుఁ బ్రేమా - సక్తివృద్ధిచేసి మనుపుమా = ముక్తిదాత యేసువిభుని - రక్తమహిమఁ - దెల్పియఘ వి -ముక్తులనుగఁజేసి మమ్ము - యుక్తమార్గమందు నిలుప ||రమ్ము||

3.జీవితపుబాధ లెన్నియో - పెనుఁబ్రోవులగుచు - నావరించి మమ్ముఁ దా కిన = మాకు నీవె హితుఁడవగుచు - భావమిచ్చి భయముఁదీర్చి - జీవ మైన యేసుపాద - సేవకు మముసిద్ధపఱుప ||రమ్ము||

4.పలువిధంబులైన చింతలు - చెలరేఁగి మమ్ము - కలఁతపెట్టు నవసరం బున = వలనుచెడిన మామనముల - మలయు వ్యాకులతను మాన్పి - వలయు నాదరణము నిచ్చు - పలుకుదోడు వీవెయగుచు ||రమ్ము||

5.తొలిప్రవక్త లెంద రెందఱో - నీ ప్రేరణమునఁ -బలికినట్టి వేదమందునఁ= గల నిగూఢ భావములను - దెలుపు నొజ్జవీవెయగుటఁ - దెలిపి వాని మమ్ము జ్ఞాన - కలితమతులఁ జేయుకొఱకు ||రమ్ము||

6.సడలివాడిపోవుచున్న మా = విశ్వాసలతను - బలసమృద్ధి నుద్ధరించి మా = యెడఁదశోధనములకతనఁ బొడము సంశయాంకురంబు - లడఁచి ప్రేమఁ జ్యోతిమాలోఁ - గడుస్థిరముగ వెలుఁగజేయ ||రమ్ము||

7.స్తుతులు నుతులు నీకెచెల్లుఁగా - వుత యుగయుగంబు - లతులభక్తిని న్నె కొలుతుము = క్షితినివీడ మమ్ము మోక్ష గతికి నడిపి చేర్పుమయ్య - మృతికి మృత్యువైనవాని వితతసింహపీఠిపైని ||రమ్ము||
- దాసరి మోజెస్ 

24 May 2026

రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా Rammu rammu parishdhathma

245
పరిశుద్ధాత్మ, రమ్ము 
రా - శ్రీ రాగము,   తా - ఆది 

రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా - రమ్ము రమ్ము = రమ్ము దీవింపఁగ - నిమ్ము నీదు కృపను - నింపు మా డెందముల్ - నెమ్మదిఁ బొందంగ ||రమ్ము||

1.జీవంపు టూటవు - ప్రేమ జ్వాల వీవె = దేవ దాన మీవె - యాద రించువాఁడ ||రమ్ము||

2.దేవహస్త మీవె - వరము లన్ని నీవె = నీవె తండ్రి వాగ్ధ - త్తమ్మయి వెలుగుచుండు ||రమ్ము||

3.మాటలాడు శక్తి - నిచ్చి నాయాత్మను = మేటిల్ల నను నభి - షేకించుమీ దేవ ||రమ్ము||

4.ఇమ్ము నీదు వెలుఁగు - నింపు నీ ప్రేమతో = కమ్ము నాకుఁ తోడు = నన్ను బలపర్చుమా ||రమ్ము||

5.పారదోలు దవ్వు - నాత్మ శత్రువుల నిం = పార నీదు నెమ్మ - దిచ్చి ప్రోవు నన్ను ||రమ్ము||

6.ముందు నీవు నడువ - నన్ను డాయ దేది = యిందు నన్ను ఁ జెరచు - వారు లేరు భువిని ||రమ్ము||

7.జనకుఁ జూపు నాకు - నట్లె చూపు సుతుని = ననయ మెఱిఁగి దేవ నిను నమ్మి జీవింప ||రమ్ము||

8.జనక సుతాత్మయౌ ఘనత్రిత్వమౌ దేవా నిను సన్నుతింపను నీదు దయ నంపుమా ||రమ్ము||
- మేడికాయల సాధువు 


07 October 2024

Ravayya Yesu Nadha రావయ్య యేసునాధా

323 
క్రైస్తవ పశ్చాతాపం 
రా - అఠాణ    తా - ఆది 

రావయ్య యేసునాధా - మా - రక్షణమార్గము నీ - సేవఁ = జేయ మమ్ముఁ - జేపట్టుటకు ||రావయ్య||

1.హద్దు లేక మేము - ఇల - మొద్దులమై యుంటిమి - మా = కొద్ది బుద్ధులన్ని - దిద్ది రక్షింపను ||రావయ్య||

2.నిండు వేడుకతోను - మమ్ము - బెండువడక చేసి - మా  = గండంబు లన్నియు - ఖండించుటకు ||రావయ్య||

3.మేర లేని పాపము - మాకు - భారమైన మోపు - నీవు = దూరంబుగాఁ జేసి - దారిఁ జూపుటకు ||రావయ్య||

4.పాపుల మయ్య మేము - పరమ - తండ్రిని గానకను - మా = పాపంబు లన్నియుఁ - పారఁ దోలుటకు ||రావయ్య||

5.అందమైన నీదు - పరమానంద పురమందు = మే మందరముజేరి ఆనందించుటకు ||రావయ్య||

06 October 2024

Roberto de Nobili రాబర్ట్ డి నోబిలీ

📚 *ఒక మిషనరీ జీవిత చరిత్ర* 📚 
🛐 *Roberto de Nobili రాబర్ట్ డి నోబిలీ* 🛐



రాబర్ట్ డి నోబిలీ (1577 – 16 జనవరి 1656) 17వ శతాబ్దికి చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రబోధకుడు, సన్యాసి. ఆయన ప్రముఖంగా దక్షిణ భారతదేశంలో(సిలోన్ వంటి ప్రాంతాల్లో కొన్నేళ్ళు) క్రైస్తవ మతాన్ని బోధిస్తూ జీవించారు. తత్త్వబోధానంద స్వామి అన్న పేరు పెట్టుకుని, హిందూ సన్యాసుల వేషంలో, వారి మతంలోని పదజాలాన్నే వాడుతూ ప్రజలను క్రైస్తవంలోకి తిప్పేవారు. అప్పటివరకూ ముందు ప్రచారం చేసిన క్రైస్తవ ప్రచారకులు విఫలం కాగా రాబర్ట్ డి నోబిలీ క్రైస్తవంలోకి ప్రజలను తీసుకురావడంలో విజయవంతం కావడంతో కొన్నేళ్ళపాటు భారతీయ క్రైస్తవ ప్రబోధకుల్లోనూ, ఆయనను పంపిన చర్చి ఆధ్యాత్మిక నేతల్లోనూ మంచిపేరు తెచ్చుకున్నారు. ఐతే మరికొందరు తోటి క్రైస్తవ ఫాదర్లు నోబిలీ హిందువుల ఆచారాలు, నమ్మకాలు అనుకరిస్తూ ప్రచారం చేయడం అసమంజసం అంటూ వాదన లేవదీయడంతో అదే క్రైస్తవ ప్రచారకుల్లో అపకీర్తి పాలు కూడా అయ్యారు. చివరకు హిందూసాధువులు, సన్యాసులు జీవించేలాంటి కష్టసాధ్యమైన జీవితం సాగించడంలో కలిగిన అనారోగ్యం వల్ల మరణించారు. రాబర్ట్ డి నోబిలీ 1577 సెప్టెంబరులో మోన్టెపుల్కియానో, టస్కనీ ప్రాంతంలో జన్మించారు. ఆయన మే 20, 1605లో పశ్చిమ భారతంలోని గోవా కు చేరుకున్నారు. పోర్చుగీసుల పరిపాలనలోని గోవా అప్పటి భారతదేశంలోని క్రైస్తవ మిషన్లకు ముఖ్యకేంద్రంగా ఉండేది. ఆయన భారతీయ సంస్కృతికి, క్రైస్తవ మతానికి మధ్య సమన్వయాన్ని సాధించాలన్న ఆలోచనలో క్రీస్తపురాణమనే గ్రంథరచనలో ఉన్న ఫ్రాన్సిస్ థామస్ స్టీఫెన్స్‌ను కలిసివుంటారని చరిత్రకారుల భావన. ఆపైన ఆయన భారతదేశంలో క్రైస్తవ మిషనరీగా చాలా విచిత్రమైన పద్ధతిలో పనిచేశారు.

రాబర్ట్ డి నోబిలీ హిందూ సన్యాసి వేషభాషలు స్వీకరించి హిందువుల పద్ధతిలోనే క్రైస్తవాన్ని ప్రచారం చేశారు. ఆ క్రమంలో ఆయన హిందూమతస్తులు అవలంబించే కొన్ని మత సాంస్కృతిక పద్ధతులను క్రైస్తవానికి ఆమోదయోగ్యమని ప్రకటించేవారు. ఈ వ్యవహారానికి పరాకాష్టగా తత్త్వబోధక స్వామిగా మార్చుకున్నారు.

కొందరు రాబర్టో డి నోబిలీని యజుర్వేదం అనే పురాతన సంస్కృత గ్రంథానికి ఫ్రెంచ్ అనువాదంగా భావించే నకిలీ పత్రం యొక్క రచయితగా గుర్తించారు. మాక్స్ ముల్లర్ డి నోబిలీ దాని రచయిత కాదని నిర్ధారించారు. లూడో రోచెర్ ఈజోర్వేదం యొక్క వివరణాత్మక అధ్యయనాన్ని ప్రచురించాడు, ఈ గ్రంథం యొక్క రచయిత ఫ్రెంచ్ మిషనరీ అయి ఉండాలి మరియు అతను అనేక పేర్లను ప్రతిపాదించాడు. ఉర్స్ యాప్ జీన్ కాల్మెట్ (1692–1740) రచయితగా సాక్ష్యాలను అందించింది.

2013 శరదృతువులో, లయోలా విశ్వవిద్యాలయం చికాగో తన లేక్ షోర్ క్యాంపస్‌లో డి నోబిలి హాల్ అనే రెసిడెన్స్ హాల్‌ను ప్రారంభించింది. ఈ ఐదు-అంతస్తుల భవనంలో సుమారు 200 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, అంతర్జాతీయ లెర్నింగ్ కమ్యూనిటీ మరియు 350-సీట్ల డైనింగ్ హాల్ ఉన్నాయి.

విశ్వనాథ సత్యనారాయణ రచించిన తెలుగు చారిత్రక నవల ఏకవీరలో, తత్త్వబోధక స్వామి పాత్ర డి నోబిలి ఆధారంగా కనిపిస్తుంది. అతను హిందూ సన్యాసి వేషధారణ మరియు సన్యాసి జీవన శైలిని ధరించి క్రైస్తవ మతాన్ని బోధించాడు మరియు కథానాయకుడు ఏకవీరతో ఉపన్యాసం మరియు చర్చలో పాల్గొంటాడు.

భారతదేశంలోని జార్ఖండ్‌లో, అతని పేరు మీద డి నోబిలి స్కూల్ పేరుతో 8 జెస్యూట్-నడపబడుతున్న పాఠశాలలు ఉన్నాయి. వారు కౌన్సిల్ ఫర్ ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CISCE), న్యూఢిల్లీకి అనుబంధంగా ఉన్నారు.

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...