Showing posts with label హోరేశియో రెక్మండ్ పామర్. Show all posts
Showing posts with label హోరేశియో రెక్మండ్ పామర్. Show all posts

06 August 2023

Shodhanaku meeru chotiyakudi | శోధనకు మీరు చోటియకుఁడి

369
Yield not to temptation

1.శోధనకు మీరు చోటియకుఁడి 
ధైర్యము వహించి పోరాటమును 
సాధించెడు వారు జయించెదరు 
సాతానుకు లొంగఁ బాపం బగును.
 
      ||యేసు శక్తిని గోరి 
        యెల్లకాలము వేఁడుఁ 
        డేసుఁ డాశతో మిమ్ము 
        డాసి నడుపును ||
 
2.దుర్భుద్ధి కుభాష మానుండు సదా 
పాపాత్ముల పొందు తప్పించుకొని 
శ్రీ దేవుని పేరున్ దూషింపకయు 
శ్లాఘించుచు మీరు వర్ధిల్లుఁ డిలన్
 
3.జయించెడువారు సౌందర్య ప్రభన్ 
చారు మకుటంబు ధరించెదరు 
ప్రభుండగు యేసు నిక్కంబు నమ్ముఁ 
డాయనె నిత్యంబు సాయము నిచ్చున్
- హోరేశియో రెక్మండ్ పామర్
అను: ఆల్ ఫ్రెడ్ త్యాగరాజు పామార్ 

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...