Showing posts with label Dandalu Dandalyya Saami Ninda lyrics. Show all posts
Showing posts with label Dandalu Dandalyya Saami Ninda lyrics. Show all posts

30 May 2021

Dandalu Dandalyya Saami Ninda | దండాలు దండాలయ్యా సామి నిండా

దండాలు దండాలయ్యా సామి - నిండా మా దండాలయ్యా 
మెండుగ దీవించి మా బతుకు పండించి 
అండగ ఉండవయ్యా నీవుండగ - లోటేదయ్యా మా కొండవు నీవేనయ్యా 

1. పేదయింట పుట్టినావా - బీదలైన మమ్ము బ్రోవ
 కష్టాలెన్నో ఓర్చినావా - మాదు నష్టాలు తీర్చేటి దేవ
 నీవు లేక నిముషమైన బతకలేము 
 నీదు సెలవు లేక అడుగు కదపలేము 

2. చెదరిన గొర్రెల వెదకే - కరుణామయుడవయ్య దేవ 
మది నిండ నీ రూపు నిలిపి - నీ శరణు కోరితిమయ్య దేవ 

3. పుట్టించి మమ్ముల పెంచే - సృష్టికర్తవు నీవు దేవ
 విడువమయ్య నీ త్రోవ - నీవే నడిపించవయ్య మా నావ

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...