Showing posts with label Sathish Kumar songs. Show all posts
Showing posts with label Sathish Kumar songs. Show all posts

06 December 2022

Manishini pranamga preminchina | మనిషిని ప్రాణంగా ప్రేమించిన


మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు, 
మనిషికై ప్రాణాన్ని అర్పించిన నాథుడు (2) 
మనకోసమే నేడు జన్మించెను చూడు (2) 
హల్లేలూయ పాడు, సంతోషమే నేడు...

ప్రవచనాలన్నియు నెరవేర్చిన నాడు, 
ప్రపంచాన్ని రక్షింప జన్మించే నేడు, 
పశువుల పాకలో పవళించెనే (2) 
పరలోకమే ప్రస్తుతించేనే (2)  

పాపులందరిని ప్రేమించిన వాడు, 
పాపుల రక్షణకై ప్రాణం పెట్టినవాడు, 
పశువుల పాకలో పవళించెనే (2) 
పరలోకమే ప్రస్తుతించేనే (2)

మనకోసమే నేడు జన్మించెను చూడు (2) 
హల్లేలూయ పాడు, సంతోషమే నేడు... 
పాపిని ప్రాణంగా"

12 July 2021

Nee Krupaye Nannu Kaachenu | నీ కృపయే నన్ను కాచెను నీ దయయే

నీ కృపయే నన్ను కాచెను నీ దయయే నన్ను దాచెను
నీ క్షమయే నన్ను ఓర్చెను నీ వాక్యమే ఓదార్చెను
చాలునయ్యా నీ కృప చాలునయ్యా

1. గాఢాంధకారములో నేనుండగా - నీ సన్నిధియే నాకు వెలుగాయెగా
నా శత్రువుయే నన్ను తరుముచుండగా - నా స్థానములో నిలిచి పోరాడెగా
భయభీతులలో నేనుండగా - అవమానములో అల్లాడగా 
నా కాపరియై నన్ను చేరెగా - నావైరులను వెళ్ళెగొట్టెగా
చాలునయ్యా నీ కృప చాలునయ్య

2. నావారే నన్ను గెంటి వేయగా - మరణభయమే నన్ను ఆవరింపగా 
నా చెంతచేరి నన్ను స్వస్థపరిచెగా - నీ చేయి చాచి నన్ను చేరదీసెగా 
అపజయమే నన్ను కృంగదీయగా - అంటరానిదాననని గేళిచేయగా 
నా పక్షమున చేరి జయమిచ్చెగా - నాతో వుంటానని మాటిచ్చిగా 
చాలునయ్యా నీ కృప చాలునయ్య 

CALVARY TEMPLE's
Album: Nee Maate Chaalunayaa
DOWNLOAD MP3 SONG HERE 👇

Brathakaalani Unna Brathakalekunna | బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా


బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా - నిలవాలని ఉన్నా నిలవలేకున్నా 
చూడాలని ఉన్నా చూడలేకున్నా - చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా 
బ్రతికించుమో యేసయ్యా - దరి చేర్చుమో నన్నయ్య..(2)
||బ్రత||

1. కాపరిలేని గొఱ్ఱనైతి – కాటికి నే చేరువైతి 
కావలిలేని తోటనైతి – కారడవిగా నే మారితి 
గూడు చెదరిన గువ్వనైతి – గుండె పగిలిన ఏకాకినైతి
గుండె దిగులుగా వుందయ్యా – గూడు చేర్చుమో యేసయ్యా (2) ||బ్రత||

1. నా ఆశలే అడియాశలై – అడుగంటెనే నా జీవితం
శోధనల సుడివడిలో – తొట్రిల్లెనే నా పయనం
 చుక్కానిలేని నావనైతి – గమ్యము తెలియక అల్లాడుచుంటి 
గురి చేర్చుమో యేసయ్యా – నా గుండె గుడిలో నీవుండయా (2)  ||బ్రత||
                  album: neevunte chaalunaya,
      
DOWNLOAD MP3 SONG HERE 👇

Neeve nannu korokunnavu Neeve | నీవే నన్ను కోరుకున్నావు నీవే నన్ను

నీవే నన్ను కోరుకున్నావు నీవే నన్ను చేరుకున్నావు
నీవే నన్ను విడిపించావు నీవే నన్ను విడువనన్నావు
నీ ప్రేమొక వింతయ్యా ఊహకందదు యేసయ్యా
ఎంత ప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీదయ్యా 

1.నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నావు - 
నీ కృపలో నన్ను కనికరించావు 
నీ రాజ్యములో నను దాచి వుంచావు - 
నీ స్వాస్థ్యముగా నన్ను మార్చి వేసావు 

2.నీ వాక్యముతో నన్ను శుద్ధి చేశావు - 
నీ రక్తముతో నన్ను కడిగి వేశావు 
నీ వాగ్దానముతో నన్ను స్థిరపరచావు - 
నీ ఆత్మతో నన్ను నింపి వేసావు 

Album: Nee Thodu Chalunaya 
calvary temple, 4th music album
DOWNLOAD MP3 SONG HERE 👇

07 April 2021

Ardham Chesukune Apthudavu | అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే

అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే బంధువు నీవే
ప్రేమను పంచగలిగినా పరమ తండ్రివి నీవె
సహయం చెయగలిగిన నా హితుడవు నీవే
నీ ప్రేమ చాలయ్య నను కొన్న యేసయ్య
నీ ప్రేమ చాలయ్య నను కన్న యేసయ్య

1 కన్నీరు తడిచి కలతలను బాపే
కలుషాత్ములను కడిగే కరుణాత్ముడవు నీవే
కృపా సత్య సంపూర్ణమై నా హృధిని గెలిచావే
కొనియాడ నా యేసయ్య కోటి కంటాలతో
కీర్తించే నా యేసయ్య స్తోత్ర గీతాలతో
ఎందుకింత ప్రేమయ్య నా పైన యేసయ్య

2 వేదనలు తొలగించి శోధనలు గెలిపించి
వారసునిగా మార్చి వీరునిగా చేసావే
వాక్యంతో నను నింపి వారధిగా నిలిపావే
విలువైన పిలుపుతో పిలిచి వెన్నంటే ఉన్నావే
ఎంత వింత ప్రేమయ్య నా పైన యేసయ్య

03 February 2021

Kanneeru Manishini Bhaadisthundi | కన్నీరే మనిషిని బాధిస్తుంది

కన్నీరే మనిషిని బాధిస్తుంది 
ఆ కన్నీరే మనస్సును ఓదారుస్తుంది 
కన్నీరే కాదనుకుంటే ఓదార్పే కరువైపోతుంది 

1. కన్నీరే మరియను బాధించింది 
    ఆ కన్నీరే మరణమును గెలిపించింది 
    కన్నీరే కాదనుకుంటే లాజరు తిరిగి బ్రతికేనా 
    కన్నీరే వలదనుకుంటే దేవుని మహిమ కనిపించేనా

2. కన్నీరే హన్నాను బాధించింది 
    ఆ కన్నీరే కుమారున్ని దయచేసింది 
    కన్నీరే కాదనుకుంటే సమూయేలు జన్మించెనా
    కన్నీరే వలదనుకుంటే దేవుని కృపను గాంచెనా

Teliyaka vaaru siluva vesaru lyrics | తెలియక వారు సిలువ వేశారు

తెలియక వారు సిలువ వేశారు -
క్షమించమని ప్రార్థించాడు యేసు(2)
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే 
క్షమించేదెవరు ? ప్రార్థించేదెవరు ?
 
తిండికోసము జ్యేష్ఠత్వమును అమ్ముకున్నాడు ఏశావు 
వెండి కోసము శిష్యత్వమును అమ్ముకున్నాడు ఆ యూదా
ఎవరికోసం క్రైస్తవ్యమును అమ్ముకుంటాము మనము 
ఏశావులా భ్రష్టులౌతాము యూదాల పడి చస్తాము 
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే 
క్షమించేదెవరు ? ప్రార్థించేదెవరు ? 
 
పదవికోసము ప్రభువు యేసును అమ్ముకొంటారా ఓటు నోటుకు
ఆస్తులకోసం ప్రభువు క్రీస్తును అమ్ముకొంటారా పార్టీ కోర్టుకు 
దేవునిపాలన మనిషిపాలనగా మారితే మనము చీలిపోతాము
దేవుని ఇల్లు మనిషి ఇల్లుగా మారితే  కూలి కాలి పోతాము
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే 
క్షమించేదెవరు ? ప్రార్థించేది ఎవరు ?
DOWNLOAD MP3 SONG HERE 👇

Mattivira Vattivira Mannuvura | మట్టివిరా వట్టివిరా మన్నువురా

మట్టివిరా వట్టివిరా మన్నువురా మన్నవురా 
కాయము మాయము ఖాయమురా అయ్యయ్యో(2)

1.అటుచేసి ఇటుచేసి అందరిని మోసం చేసి(2)
   సంఘాన్ని రెండుగ చీల్చావే అయ్యయ్యో 
   నీ గోతిలో నువ్వే పడ్డావే అయ్యయ్యో 
                                            ||మట్టివిరా||
2.నువ్వేసిన వేషాలు నువు చేసిన మోసాలు(2)
   నరకాగ్నికి నిను చేర్చునులే అయ్యయ్యో 
   నరకాగ్నిలో కాలిపోదువులే అయ్యయ్యో 
                                            ||మట్టివిరా||
3.నీ బ్రతుకు దెరువుకోసం బైబిల్ ను చేతబట్టి(2)
   పరమార్ధం మర్చిపోయావే అయ్యయ్యో 
   ఆత్మలతో ఆడుకొన్నావే అయ్యయ్యయ్యో 
                                            ||మట్టివిరా||
4.సువార్త సేవకోసం పంపిన సొమ్ములన్నీ 
   సొంతానికి ఖర్చు చేశావే అయ్యయ్యో 
   శాపాన్ని తెచ్చుకున్నావే అయ్యయ్యో 
                                            ||మట్టివిరా||
5.పాపాన్ని పాతిపెట్టి దోషాన్ని దాచిపెట్టి 
   దొరలాగ తిరుగుచున్నావే అయ్యయ్యో 
   తొందరలో దొరికిపోతావే అయ్యయ్యో 
                                            ||మట్టివిరా||
6.నీ పాపం ఒప్పుకుంటే ఆ పాపం విడిచిపెడితే 
   పరలోకం నిన్ను చేర్చునులే యేసయ్యా 
   నీ పాపం కడిగివేయునులే మెస్సయ్యా
                                            ||మట్టివిరా||

Ye Baadha Ledu Ye Kashtam | ఏ బాధ లేదు ఏ కష్టం లేదు

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా 
దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా ... 
భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా ...
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయా 
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయా 

1. ఎర్ర సంద్రం ఎదురొచ్చినా - యెరికో గోడలు అడొచ్చినా 
సాతానే శోధించినా శత్రువులే శాసించినా 
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా 
నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా ... 

2. పర్వతాలు తొలగినా - మెట్టలు దద్దరిల్లినా 
తుఫానులే చెలరేగినా - వరదలే ఉప్పొంగినా 
కడకు నీ కడకు ప్రభుయేసే దిగి వచ్చుగా 
నమ్ము ఇది నమ్ము యెహెూవా యీరే గదా ...
                                     ||ఏ బాధ లేదు||

DOWNLOAD MP3 SONG HERE 👇

Padamulu Chaalani Prema | పదములు చాలని ప్రేమ ఇది

పదములు చాలని ప్రేమ ఇది 
స్వరములు చాలని వర్ణనిది 
కరములు చాపి నిను కౌగలించి పెంచిన 
కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ 
వారిని సహితం కన్న ప్రేమ 
ప్రేమ .. ఇది యేసు ప్రేమ .. ప్రేమ ఇది తండ్రి ప్రేమ 
ప్రేమ .. ఇది ప్రాణమిచ్చిన ప్రేమ ...కల్వరి ప్రేమ 

నవమాసము మోసి ప్రయోజకులను చేసిన 
కన్న బిడ్డలే నిన్ను వెలివేసినా 
తన కరములు చాపి ముదిరి వచ్చు వరకు 
నిన్నెత్తుకుని ఆదరించు ప్రేమ 
ఆవేదనంత తొలగించెడి ప్రేమ
                                               ||ప్రేమ||
మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన 
స్నేహితులే హృదయమును గాయపరచగా 
మేలులతో నింపి అద్భుతములు చేసి 
క్షమియించుట నేర్పించిన ప్రేమ 
శాంతితో నిను నడిపించెడి ప్రేమ 
                                                ||ప్రేమ||

Guruthu Chesuko O Priyuda | గురుతు చేసుకో ఓ ప్రియుడా

గురుతు చేసుకో ఓ ప్రియుడా..
గుడిలో చేసిన ప్రమాణ సూత్రము 
మరిచిపోకుమా ఓ ప్రియతమా..
మెడలో కట్టిన ఆ మంగళ సూత్రం 
తిరగబడితే క్రీస్తు కొరడా చెళ్ళుమంటుందీ శుద్ధీకరణ
                                                   ||గురుతు||
1. స్వదేశీ సంస్కృతి మరిచి - విదేశీ సంస్కృతి మరిగి  
    ఆత్మీయతను అణచి - అనురాగాన్ని విడచి 
    పబ్ క్లబ తైతక్కలాడి కాముకత్వము తలకెక్కి     
    భార్యాభర్తల మార్పిడి చూడు 
    కుటుంబ వ్యవస్థ దోపిడి నేడు 
                                                   ||గురుతు||
2. సాటి సహాయము మరిచి - సూటిపోటీగా పొడిచి 
    భర్తను అనుమానించి - పిల్లల భవితను విడిచి 
    ఇంటి గుట్టును రట్టుగ చేసి 
    భార్య నెదిరించి గడప దాటితే
    పెళ్ళి కాస్త పెటాకులై కొంప కొల్లేరౌతుంది
                                                   ||గురుతు||

Ninnu Vidachi Poledu Ninnu Marachi | నిన్ను విడచి పోలేడు నిన్ను మరచి పోలేడు

నిన్ను విడచి పోలేడు నిన్ను మరచి పోలేడు 
నీ కొరకే దిగి వచ్చాడు నీ కోసం మరణించాడు 

తన చేతులతో చేసెను తన ఊపిరిని పోసెను 
తన రూపులో తన పోలికలో నిన్ను నన్ను చేసెను 

గాయములెన్నో నొందెను బహుదెబ్బలు పొందెను నడి వీధిలో నలుగురిలో నలిగి విరిగి పోయెను 
నిన్ను విడచిపోగలడా నిన్ను మరచిపోగలడా 

ప్రాణంగా ప్రేమించెగా తన ప్రాణాన్నే నీకిచ్చెగా 
నీ కోసమే కల్వరిలో రక్తమంతా కార్చెగా 
నిన్ను విడచిపోగలడా నన్ను మరచి పోగలడా 
నా కొరకే దిగివచ్చెగదా నా కోసం మరణించెగదా 
నన్ను విడిచిపోలేడు నన్ను మరిచిపోలేడు

Nee Mandirame Maaku Ashrayam | నీ మందిరమే మాకు ఆశ్రయం నీ సన్నిధియే

నీ మందిరమే మాకు ఆశ్రయం -
నీ సన్నిధియే మాకు ఆధారము (2)
నీ మాటలతో మమ్మునోదార్చుము - 
నీ వాక్కుతో మమ్ము స్వస్థపరచుము 
నీవే కదా ఆధారము నీవే కదా ఆశ్రయం 
                                    ||నీ మందిరమే||
యాకోబును దీవించినట్టుగా - 
మమ్ము కూడా దీవించుమయా 
యోసేపుకు తోడైయున్నట్టుగా -
మాకు కూడ తోడుండుమయా 
మోషేను నడిపించినట్లుగా మమ్మును నడిపించుమయా దావీదును హెచ్చించినట్లుగా మమ్మును హెచ్చించుమయా
                                   ||నీ మందిరమే||
శిష్యులతో మాట్లాడినట్లుగా - 
మాతో కూడా మాట్లాడుమయా 
పేతురును క్షమియించినట్లుగా -
మమ్ము కూడా క్షమియించుమయా 
తోమాను సరిచేసినట్లుగా మమ్మును సరిచేయుమయా పౌలును వాడుకొనినట్లుగా మమ్మును వాడుకొమ్మయా
                                   ||నీ మందిరమే||

16 August 2020

Silvalo nakai karchenu | సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము

సిల్వలో నాకై కార్చెను - యేసు రక్తము (2) 
శిలనైన నన్ను మార్చెనూ -యేసు రక్తము (2)
యేసు రక్తము ప్రభు -యేసు రక్తము (2)
అమూల్యమైన రక్తము -యేసు రక్తము 

1.సమకూర్చు నన్ను తండ్రితో -యేసు రక్తము (2)
సంధి చేసి చేర్చునూ -యేసు రక్తము (2)
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము (2)
ఐక్య పరచును తండ్రితో -యేసు రక్తము (2)

2.సమాధాన పరచును- యేసు రక్తము (2)
సమస్యలన్నీ తీర్చును- యేసు రక్తము (2)
యేసు రక్తము -ప్రభు యేసు రక్తము (2)
సంపూర్ణ శాంతి నిచ్చును- యేసు రక్తము (2)

3.నీతిమంతులుగా చేయును- యేసు రక్తము (2)
దుర్నీతినంత బాపును- యేసు రక్తము (2)
యేసు రక్తము -ప్రభు యేసు రక్తము (2)
నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము (2) 

4.రోగములను బాపును- యేసు రక్తము (2)
దురాత్మల పారద్రోలును- యేసు రక్తము (2)
యేసు రక్తము -ప్రభు యేసు రక్తము (2)
శక్తి బలము నిచ్చును -యేసు రక్తము (2)

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...