Showing posts with label యేసయ్య నీ ప్రేమ నా సొంతము. Show all posts
Showing posts with label యేసయ్య నీ ప్రేమ నా సొంతము. Show all posts

24 September 2021

Yesayya nee prema naa | యేసయ్య నీ ప్రేమ నా సొంతము



యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము 
యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము 
ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము 
ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం 

1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు 
నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు 
నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు 
నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం 
నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి 
నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ 

2. ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు 
లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే 
నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా 
పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం 
సాటే లేరు నీకు - సర్వాధికారివి నీవు 
మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...