Showing posts with label Aascharyakarudu Aalochanakartha. Show all posts
Showing posts with label Aascharyakarudu Aalochanakartha. Show all posts

06 November 2021

Aascharyakarudu Aalochanakartha | ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త - నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2)
తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో
తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2) ||ఆశ్చర్య||

1.తన చేతిలో రోగాలు లయమైపోయెను
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను(2)
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు(2)
నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2) ||ఆశ్చర్య||

2.మనకోసం తనప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
మనకోసం సజీవుడై లేచినవాడతడు (2)
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2)
తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2) ||ఆశ్చర్య||
                                     - సిరివెళ్ల హనోక్
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...