యేసే గొప్ప దేవుడు - మన యేసే శక్తీమంతుడు - యేసే ప్రేమ పూర్ణుడు - యుగ యుగములు స్తుతి పాత్రుడు (2)
స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి - ఘనత బలము కలుగును ఆమెన్ (2) ||యేసే||
1.మహా శ్రమలలో - వ్యాధి బాధలలో - సహనము చూపి స్థిరముగా నిలిచిన - యెబు వలెనే జీవించెదను (2)
అద్వితీయుడు.. ఆదిసంభూతుడు - దీర్ఘాశాంతుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||
2.ప్రార్ధన శక్తి తో - ఆత్మ బలముతో - లోకమునకు ప్రభువును చాటిన - దానియేలు వలె జీవించెదను (2)
మహోన్నతుడు.. మన రక్షకుడు - ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||
3.జీవితమంతా.. ప్రభుతో నడిచి - ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన - హనోకు వలె నేజీవించెదను (2)
అద్భుతకరుడు.. ఆశ్చర్యకరుడు - నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||
-Pas. Philliph Gariki
No comments:
Post a Comment