యేసయ్య పొలమురా - ఏపుగా వుందిరా
ఎగసాయం సూడరా - ఎంతో బాగుందిరా (2)
నారొకడు నాటేనురా ... నీరొకడు పోసేనురా (2)
పైరిచ్చినాడురా... పైనున్న వాడురా (2) ||యేసయ్య||
ఎలుకలున్నాయిరా... ఏర్లు కొరికేనురా (2)
నక్కలున్నాయిరా.. నక్కి చూస్తాయిరా (2) ||యేసయ్య||
వరదలలొచ్చెనురా ... బురద తెచ్చెనురా (2)
బురదలో నా పైరు ... మురిగి చచ్చేనురా (2) ||యేసయ్య||
పనివాళ్ళు లేరురా ... పంటలు పాడౌనురా (2)
పనివార్ని పంపమని .... ప్రభుయేసుని అడగరా (2)||యేసయ్య||
No comments:
Post a Comment