చూడాలని ఉన్నా చూడలేకున్నా - చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా
బ్రతికించుమో యేసయ్యా - దరి చేర్చుమో నన్నయ్య..(2)
||బ్రత||
1. కాపరిలేని గొఱ్ఱనైతి – కాటికి నే చేరువైతి
కావలిలేని తోటనైతి – కారడవిగా నే మారితి
గూడు చెదరిన గువ్వనైతి – గుండె పగిలిన ఏకాకినైతి
గుండె దిగులుగా వుందయ్యా – గూడు చేర్చుమో యేసయ్యా (2) ||బ్రత||
1. నా ఆశలే అడియాశలై – అడుగంటెనే నా జీవితం
శోధనల సుడివడిలో – తొట్రిల్లెనే నా పయనం
చుక్కానిలేని నావనైతి – గమ్యము తెలియక అల్లాడుచుంటి
గురి చేర్చుమో యేసయ్యా – నా గుండె గుడిలో నీవుండయా (2) ||బ్రత||
album: neevunte chaalunaya,
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment