6
యెహెూవా స్తుతి
రా - యమన్, తా - ఆది
భీకరుండౌ మా యెహోవా - ¹పీఠ మెదుటం గూడరే = యేకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ ||
1.మట్టితోనే మమ్ము నెల్ల - మానవులుగ సృజించెను = ఇట్టి శక్తుండౌ ప్రభు న్మే మెచ్చుగా మది నెంతుము ||భీకరుండౌ||
2.²ఏరితోడు లేక మము స - ర్వేశ్వరుఁడు సృష్టించెను = ధారుణిం దా నొక్కఁడే మా - దైవమని పూజింతుము ||భీకరుండౌ||
3.³పుట్టగిట్టంజేయఁదానై - నట్టి దేవుని శక్తిని = బట్టుగా లోకస్థులారా - ప్రస్తుతింపరె భక్తిని ||భీకరుండౌl|
4.మేటి సంగీతంబులుపై - మింట ⁴నారవ మొందను = జాటరే వేవేల నోళ్ళన్ - సన్నుతుల్ ప్రభు వందను ||భీకరుండౌ||
5.మిక్కిలి కష్టంబులతో - ⁵మితికిని బాల్పొందను = దిక్కులేని గొఱ్ఱె లట్లు - దిరుగఁ జేర్పన్ మందను || భీకరుండౌ||
_____________________________
¹సింహాసనము. ²ఎవ్వరి. ³చంపను. ⁴మ్రోత. ⁵చావు.
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment