23 July 2023

Bharatha desha suvartha sanghama భారత దేశ సువార్త సంఘమా


భారత దేశ సువార్త సంఘమా - భువి దివి సంగమమా (2)
ధర సాతానుని రాజ్యము కూల్చే - యుద్ధా రంగమా ||భారత||

1.ఎవని పంపుదును నా తరపున - ఇల ఎవరు పోవుదురు నాకై (2)
నేనున్నాను నన్ను పంపమని - రమ్మూ సంఘమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత||

2.అడవి ప్రాంతములు, ఎడారి భూములు - ద్వీపవాసులను గనుమా (2)
అంధకార ప్రాంతములో ప్రభుని - జ్యోతిని వెలిగించను కనుమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత||

3.బ్రతుకులోన ప్రభు శక్తిలేని - క్రైస్తవ జనాంగమును గనుమా (2)
కునుకు దివ్వెలను సరిచేయగ - ఉజ్జీవ జ్వాలగొని చనుమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత||

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...