572
ఔదార్యము
రా - కాంభోజి, తా - రూపకము
స్తుతియు మహిమయు నీకే - క్షితికిన్ దివికిన్ నీటి - వితతికిన్ కర్తవై - వెలయు మా దేవ = ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు - హితుడా మా ప్రేమ నీ - కెట్లు చూపుదును ||స్తుతియు||
1.పసిడి వర్ణపుటెండ - భాగ్యధారల వాన - విసరు మంచిగాలి - విరియు పుష్పములు = రసమొల్కు పండ్లు నీ - రమ్య ప్రేమన్ చాటున్ - ప్రసరించు కోతలో - ఫలనుందు వీవు ||స్తుతియు||
2.నెమ్మదిగల యిండ్లు - నిజ సౌఖ్య కాలములు - ఇమ్మహి ఫలియించు - నైశ్వర్యాధికముల్ = ఇమ్ముగ గలిగిన - హృదయులమై వందనమ్ములు ఋణపడి - యున్నాము నీకు ||స్తుతియు||
3.దురితంబు లొనరించి - దౌర్భాగ్య స్థితి నున్న - ధరణికి నీ పుత్రున్ - ధర్మంబు జేసి = నరుల కీ ధర్మమున కొరఁత దీర్చెడు సర్వ - వరము లమర్చిన - పరమోపకారి ||స్తుతియు||
5.జీవంబు ప్రేమను - జేవఁ గల్గించెడు - పావనాత్మను మాకై - పంపితివి = దీవెన లేడు రె - ట్లావరింపను మమ్ము - నీ విమలాత్మ వా - నిని గుమ్మ రించు ||స్తుతియు||
6.నరులకు విమోచ - నము గల్గె పాపంబుల్ - పరిహార మాయెఁ గృ - పాసాధనముల్ = దొరికె మోక్షాంశంబు - స్ధిరమాయె మేము నీ - కొరకేమి తేగలము - పరిపూర్ణ జనకా ||స్తుతియు||
6.మాకై వాడుకొనెడి - రూకల్ వ్యర్ధంబగును - నీకై యప్పుగనిచ్చు - నిఖిల వస్తువులు = శ్రీకరంబగు నిత్య - శ్రేష్ఠ ధన నిధియై పై - లోకంబు నందుండు - లోపంబు లేక ||స్తుతియు||
7.జీవంబు వస్తువులు - శ్రేయస్సు దాన స్వ - భావంబు శక్తియు - భాగ్యంబులు = నీ వలననే లభ్యమై వెలయుచున్నవి - నీ వాసమే మాకు - నిత్యానందంబు ||స్తుతియు||
- ముంగమూరి దేవదాసు
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment